కరోనా గురించి కొత్తవిషయం చెప్పిన WHO

కరోనా చైనా సృష్టించిన వైరస్ అని,దానితో ప్రపంచ దేశాల ఆర్థిక వ్వవస్థ ను పతనం చేయడం చైనా కుట్ర అని మిగతా దేశాలు ఆరోపిస్తున్నాయి.ఈ పరిస్థితులలో కరోనా వైరస్ పుట్టుక గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన విషయాన్ని వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నట్లుగా ఇది చైనా లోని ల్యాబ్ లో పుట్టిన బయొవైరస్ కాదని స్పష్టం చేసింది.ఐతే వెైరస్ ఏ జీవి నుండి సంక్రమించింది అనే దానిపై ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయని,పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయని WHO తెలిపింది.ఏది ఏమైనా కరోనా బయోవార్ కాదు,అది ప్రయోగశాల నుండి లీక్ అవలేదు,జంతువుల ద్వారా నే మనుషులకు సోకింది అనే స్పష్టమైన సమాచారం రావడం మాత్రం ప్రపంచ దేశాల తో పాటు చైనాకు కుడా ఊరట కలిగించే విషయం.ఇప్పటి కే వెైరస్ విషయం లో నిజాలను దాచి పెట్టిందని చైనా ను అంతర్జాతీయ న్యాయస్థానం లో దోషిగా నిలబెట్టాలనే ఆలోచనలో మిగతా దేశాలు ఉన్న తరుణంలో ఇది చైనా కు పెద్ద ఊరట అనే చెప్పవచ్చు.

Related Articles

Back to top button