క్షీణించిన కిమ్ ఆరోగ్యం???

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం ఆందోళన కరంగా ఉన్నట్లు అమెరికన్ మీడియా వార్తా కధనాలను ప్రచురితంచేసింది.కొద్ది రోజుల క్రితం కిమ్ కు గుండె కు సంబంధించిన ఆపరేషన్ జరిగిందని ఆ సర్జరీ తరువాత అతని ఆరోగ్యం క్షీణించింది అని మీడియా లో కధనాలు వెలువడుతున్నాయి.ఉత్తర కొరియా నియంత గా ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచిన 36 ఏళ్ల కిమ్ గత కొద్ది రోజులు గా మీడియా ముందుకు రాకపోవడం దేశీయంగా ఏ విధమైన కార్యక్రమాల లో పాలుపంచుకోకపోవడం ఈ వార్తల కు మరింత బలాన్ని ఇస్తోంది.కానీ కిమ్ ఆరోగ్యం పై వస్తున్న వార్తల ను ఉత్తర కొరియా ప్రభుత్వం ఖండించకపోవడం గమనార్హం.కాగా అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం కిమ్ ఆరోగ్యం గురించి ఖచ్చితమైన సమాచారం రాబట్టే పని లో ఉంది.

Related Articles

Back to top button