పుష్ప ని వద్దన్న విజయ్ ..?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా లో విజయ్ సేతుపతి విలన్ గా కనిపంచబోతున్నాడు అని మనకు తెలుసు.అయితే ఈ సినిమా ను కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లోనూ తెరకెక్కించాలని అనుకోవడం తోనే అసలు సమస్య మొదలైంది.
అయితే ఇపుడు సేతుపతి తమిళం లో విలన్ గా చేసేందుకు నో అంటున్నాడట..తమిళ్ మినహా అన్ని భాషల్లో నూ ప్రతినాయకుడి పాత్ర చేసేందుకు అభ్యంతరం లేదు కానీ తనకు హీరో గా మంచి గుర్తింపు ఉన్న తమిళ్ లో చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడట.
అయితే ఇపుడు చిత్ర యూనిట్ ఆ పాత్ర కు న్యాయం చేయగలిగే మరొక నటున్ని వెతికే పనిలో ఉన్నారు..దీనికి కారణం పుష్ప సినిమా 5భాషల్లో రూపొందిస్తూ ఉండటమే..తమిళ్ కోసం మరో నటుణ్ణి వెతికే బదులు అన్ని భాషల్లో చేసేందుకు అభ్యంతరం  లేని ,అదే విధంగా ఆ పాత్ర కు  న్యాయం చేయగలిగే మరో నటుణ్ణి పెట్టుకుంటే బడ్జెట్ కూడా కలిసొస్తుంది,అంతే కాక షూటింగ్ టైమ్ కూడా కలిసొస్తుంది అని ఆలోచిస్తున్నారట.అందుకే బాలీవుడ్ నటులని కూడా సంప్రదిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.
అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్ర లో నటిస్తున్న ఈ సినిమా చిత్తూరు జిల్లాలోని ఎర్ర చందనం అక్రమ రవణాను ప్రధాన అంశం గా సాగే కథ..రశ్మిక మందన ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది..మరి సేతుపతి వదులుకున్న ఈ అవకాశం ఏ నటుణ్ణి వరిస్తుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాలేమో…

Related Articles

Back to top button
Send this to a friend