వరుణ్ కు మరో హీరోయిన్ కావాలంట..!

    Written By: Last Updated:

వరుణ్ తేజ్.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ సెపరేట్ రూట్ సెట్ చేసుకున్నాడు. మొదట్లో వైవిధ్యమైన సినిమాలంటూ కమర్షియల్ గా ఇబ్బంది పడ్డా.. తర్వాత కమర్షియల్ గానూ సక్సస్ అవుతున్నాడు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోన్న వరుణ్ తేజ్ ప్రస్తుతం ఓ ఎక్స్ పర్మెంటల్ మూవీ చేస్తున్నాడు. బాక్సింగ్ స్పోర్ట్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. దీనికి టైటిల్ కూడా బాక్సర్ అనే పెట్టాలనుకుంటున్నారు. కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ఈచిత్రంలో రీసెంట్ గా దబాంగ్ -3లో సల్మాన్ సరసన నటించిన సాయీ మంజ్రేకర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ మూవీలో మరో హీరోయిన్ కూ చోటుందట.
వరుణ్ తేజ్ కోసం రెండో హీరోయిన్ ను కూడా కొత్తమ్మాయిని తీసుకోవాలని ప్రయత్నించింది టీమ్. కానీ ఎవరూ సెట్ కాలేదు. దీంతో వరుణ్ తో గతంలో మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించిన లావణ్య త్రిపాఠిని తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. లావణ్య రీసెంట్ గా అర్జున్ సురవరం సినిమాతో విజయం అందుకుంది. ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన ‘ఏ ఒన్ ఎక్స్ ప్రెస్’అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సరసన హరీష్ శంకర్ సినిమాలోనూ సెకండ్ లీడ్ గా సెలెక్ట్ అయింది అనే వార్తలూ వస్తున్నాయి. ఈ టైమ్ లో వరుణ్ తో కూడా ఛాన్స్ అంటే తనకు డిమాండ్ పెరుగుతున్నట్టే అనుకోవాలి.
మామూలుగా సీనియర్ హీరోయిన్లను మెయిన్ గా తీసుకుని కొత్త భామలను సెకండ్ లీడ్ లో తీసుకుంటారు. కానీ లావణ్యకు పెద్ద విజయాలు లేకపోవడం వల్ల వచ్చిన తంటాలు ఇవన్నీ. అందుకే అమ్మడు సెకండ్ లీడ్ అయినా ఓకే అంటోంది. మొత్తంగా వరుణ్ తేజ్ సరసన అంటే ఈ ఇద్దరి ట్రాక్ ఏమంత బాలేదు. అయినా తీసుకుంటున్నారంటే మరి ఈ సారైనా ఆ ట్రాక్ ను బ్రేక్ చేస్తారేమో చూడాలి