త్రిష క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటోందేంటీ..?

రెండు దశాబ్ధాలుగా సౌత్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తోన్న బ్యూటీ త్రిష. ఒక దశలో తెలుగు, తమిళ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. అందరు స్టార్ హీరోలతోనూ నటించింది. అయితే కొత్తగా వస్తోన్న భామల మధ్య నిలబడలేక కొన్నాళ్లుగా రేస్ లో స్లో అయింది. అయితే తమిళ్ లో రెగ్యులర్ గా సినిమాలు చేస్తూనే ఉంది. కాకపోతే అవి నయనతార లాగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్. అయితే నయన్ కు వచ్చినంత క్రేజ్ త్రిషకు రాలేదనే చెప్పాలి. అయితే త్రిష చివరిసారిగా తెలుగు స్ట్రెయిట్ సినిమా చేసింది 2015లో అంటే ఆశ్చర్యం కలుగుతుంది. బాలయ్య సరసన లయన్ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో నేరుగా సినిమా చేయలేదు. కానీ కొన్ని డబ్బింగ్ సినిమాలతో ఆకట్టుకుంది. ఈ టైమ్ లో మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ రావడం అంటే చిన్న విషయమేం కాదు. కానీ తను ఈ ప్రాజక్ట్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచింది.

తను తప్పుకున్న కారణాలు చెబితే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మూవీ టీమ్ తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెసే తను తప్పుకోవడానికి కారణం అని చెప్పింది. ముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదీ జరగడం లేదు అనేసింది. అంటే కొరటాల శివ తనను కథ విషయంలో మోసం చేసినట్టే కదా. ముందుగా చెప్పింది ఒకటి తర్వాత చేసేది ఒకటి అయినప్పుడే హీరోయిన్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.
అయితే త్రిష ఇప్పుడేం చిన్న హీరోయిన్ కాదు.. కామ్ గా కాంప్రమైజ్ కావడానికి. కథ విషయంలో పక్కాగా ఉందో లేక తనకు ముందు చెప్పిన అంశాల్లో మార్పులు చూసిందో కానీ.. తను చిరంజీవి సినిమా నుంచి తప్పుకుంది. ఏదేమైనా తన చేతిలో ఇప్పుడు తమిళ్ లో ఐదు, మళయాలంలో మోహన్ లాల్ సరసన ఓ సినిమా ఉంది.

Related Articles

Back to top button
Send this to a friend