టాలీవుడ్ లో రియల్ హీరోస్ చాలమంది ఉన్నారు::కరోనా టైమ్స్

టాలీవుడ్ లో రీల్ హీరోస్ మాత్రమే కాదు.. రియల్ హీరోస్ కూడా చాలమంది ఉన్నారని కరోనా టైమ్స్ ప్రూవ్ చేస్తున్నాయి. ఇదే కాదు.. ఎప్పుడు ఏ ఆపద, లేదా ప్రకృతి విపత్తు వచ్చినా మేమున్నాం అంటూ ముందుకు వస్తుంది టాలీవుడ్. అలాగే ఇప్పడు కంటికి కనిపించని శతృవుతో పోరాటం చేస్తోన్న రాష్ట్ర, దేశ ప్రజలకు అండగా నిలుస్తోన్న ప్రభుత్వాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ.. దేశంపై తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇక ఇప్పటి వరకూ టాలీవుడ్ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధికి, అలాగే సినిమా పరిశ్రమ కోసం మన స్టార్స్ ఎవరెవరు ఎంత ఆర్థిక సాయం అందించారో చూద్దాం..

* పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు యాభై లక్షలు, కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు.. మొత్తం రెండు కోట్లు అనౌన్స్ చేసిన పరిశ్రమలో ఓ కదలిక తెచ్చాడు.
* రెబల్ స్టార్ ప్రభాస్ కోటి రూపాయలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి అందించారు. అలాగే మూడు కోట్ల రూపాయలు పిఎమ్ రిలీఫ్ ఫండ్ కు డొనేట్ చేశాడు.
* అల్లు అర్జున్ 1 కోటి పాతిక లక్షలను తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ ప్రభుత్వ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించాడు.
* మెగాస్టార్ చిరంజీవి సినీ వర్కర్స్ ఫెడరేషన్ కు కోటి రూపాయలు ప్రకటించారు.
* మహేష్ బాబు రెండు రాష్ట్రాలకు చెరో యాభై లక్షలు ఇస్తున్నట్టు చెప్పాడు.
* సురేష్ బాబు, వెంకటేష్, రానా కలిసి సినిమా వర్కర్స్ అండ్ హెల్త్ వర్కర్స్ కోస కోటి రూపాయలు ప్రకటించారు.
* రామ్ చరణ్ 75 లక్షలు ప్రకటించాడు.
* ఎన్టీఆర్ 50 లక్షలు ముఖ్యమంత్రుల సహాయ నిధికి మరో 20 లక్షలు సినీ కార్మికులకు ప్రకటించారు.
* ఇక అందరికంటే ముందుగా నితిన్ రెండు రాష్ట్రాలకు చెరో పదిలక్షలు ప్రకటించి అందించాడు.
* ఇక వరుసగా

* సాయిధరమ్ తేజ్ రెండు రాష్ట్రాలకు కలిపి – 10 లక్షలు
* అనిల్ రావిపూడి రెండు రాష్ట్రాలకు కలిపి – 10 లక్షలు
* కొరటాల శివ రెండు రాష్ట్రాలకు కలిపి – 10 లక్షలు
* సుకుమార్ రెండు రాష్ట్రాలకు కలిపి – 10 లక్షలు
* త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు రాష్ట్రాలకు కలిపి – 10 లక్షలు
* దిల్ రాజు రెండు రాష్ట్రాలకు కలిపి – 20 లక్షలు
* వివి వినాయక్ సినీ వర్కర్స్ కోసం – 5 లక్షలు
* హారిక హాసిని సంస్థ రెండు రాష్ట్రాలకు కలిపి – 20 లక్షలు
* జీవిత రాజశేఖర్ సినీ కార్మికుల కోసం గ్రాసరీస్
* శివాజీరాజా సినీ కార్మికుల కోసం నిత్యావసర వస్తువులు అందించారు
* నిఖిల్ రెండు రాష్ట్రాల ముఖ్యమత్రులకు రెండువేల గ్లోవ్స్, రెస్పిరేటర్స్, ఐ ప్రోటెక్షన్ గ్లాసెస్ తో పాటు పదివేల ఫేస్ మాస్క్ లు అందించాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Send this to a friend