తెలంగాణలోనూ థియేటర్స్ బంద్..?

కరోనా ఎఫెక్ట్ దేశానికి గట్టిగానే పడుతోంది. అందుకే ఇప్పటికే కేరళ ప్రభుత్వం అక్కడి థియేటర్స్ ను ఈ నెల 31 వరకూ బంద్ చేసింది. అలాగే ఢిల్లీలోనూ బంద్ పెట్టేస్తున్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ‘పివిఆర్’మల్టీ ప్లెక్స్ లన్నీటినీ మూసివేయబోతున్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఏదైనా.. మనకంటే చాలా అభివృద్ధి చెందిన దేశాలే ఈ కరోనా ఎఫెక్ట్ తో విలవిలలాడుతున్నాయి. అందుకే మనం కూడా వచ్చాక దారులు వెదికే కంటే రావడానికి ఉన్న అవకాశాలను ముందే మూసేస్తే బెటర్.