తెలంగాణ లో మే 7 దాకా లాక్ డౌన్ కొనసాగింపు

తెలంగాణ లో లాక్ డౌన్ కొత్త నిబంధనలు..

తెలంగాణ లో రోజు రోజు కి పాజిటివ్ కేస్ ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సీఎం.కెసిఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. జాగ్రత్త గా ఉండకపోతే పరిస్థితులు తీవ్రం గా ఉంటాయని అందుకే లాక్ డౌన్ ను మే 7వరకు పొడిగిస్తూ తెలంగాణా ప్రభుత్వము నిర్ణయించింది.
*.తెలంగాణ లో మే 7 దాకా లాక్ డౌన్ కొనసాగింపు.ఇప్పటిదాక ఉన్న నిబంధనలు యధాతథంగా గా కొనసాగుతాయి..
*కంటైన్మెంట్ జోన్ లలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
*March , April,may 3 నెల లకు అద్దె వసూలు చేయకూడదు అని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు.
*అద్దె డబ్బుల పై వడ్డీ వెయ్యడానికి అవకాశం లేదు.
*ఇబ్బంది పెట్టిన ఇంటి యజమాని పై 100 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యవచ్చు..
*2020-21 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ స్కూల్  ఫీజు లు పెంచకూడదు..
*నెలకి కేవలం ట్యూషన్ ఫీజ్ తప్ప ఇతర ఫీజ్ లు వసూలు చేయకూడదు..
*నిబంధనలు ఉల్లంఘస్తే స్కూల్ లైసెన్స్ లు రద్దు.
*రాత్రి పూట కర్ఫ్యూ యధాతథంగా కొనసాగుతుంది
*మే 5 న మళ్లీ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి లాక్ డౌన్ పై మరో సారి నిర్ణయం తీసుకుంటాం.
*May 7 వరకు క్యాబ్ లు,బస్ లు ,మెట్రో రైలు తిరగవు
*May 7 వరకు హైదరాబాద్ కు విమాన రాకపోకలు బంద్.
*సామూహిక ప్రార్థన లకు అనుమతి నిరాకరణ
*ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ పై నిషేదం.
*కేవలం నిత్యావసర వస్తువులు,కూరగాయలు,పండ్లు మాత్రమే ఆన్ లైన్ లో అందుబాటు లో ఉంటాయి.
*మే నెలలో మొదటి వారం లో  పేదలకు  1500 రూపాయల ఆర్థిక సాయం,15కిలోల బియ్యం ఉచిత పంపిణీ.
*బ్యాంకుల నుండి ఆ డబ్బు పేదలు ఎప్పుడైన తీసుకోవచ్చు..

Related Articles

Back to top button
Send this to a friend