అది మా హక్కు అంటున్న తమిళ పొడ్యూసర్లు

లాక్ డౌన్  కారణం గా సినిమా షూటింగ్ లు లేవు..షూటింగ్ పూర్తి అయిన సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు.అందుకే విడుదల కు సిద్ధంగా ఉన్న సినిమాలను ఓటిటి అంటే ఆన్‌లైన్ ఫ్లాట్ ఫామ్ ద్వారా రిలీజ్ చేయాలనే ఆలోచన లో ఉంది సినీ పరిశ్రమ. కొద్ది మంది దీనిని వ్యతిరేకిస్తున్నా  చాలామంది దర్శక నిర్మాతలు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో వేరే మార్గం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో తమిళం లో జ్యోతిక నటించిన “పొన్ మగల్  వందాళ్” సినిమా ను అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయాలనుకున్న హీరో సూర్య  కు 30 మంది తమిళ నిర్మాతలు అండగా నిలిచారు.ఒటిటి  లో సినిమాలు రిలీజ్ చేస్తే సూర్య సినిమాలు భవిష్యత్తు లో నిషేధిస్తామని ఎగ్జిబిటర్ల సంఘం హెచ్చరించిన నేపథ్యం లో నిర్మాతలకు వారి సినిమాలు విడుదల చేసుకునే హక్కు ఉందని‌ వారంతా తెలిపారు.చిన్న సినిమాలకు ఒటిటి సంస్థ లు కూడా సహకారం అందించాలని 30 మంది నిర్మాతలు  ఒక సంయుక్త ప్రకటన లో కోరారు.

Related Articles

Back to top button
Send this to a friend