కాంగ్రెస్ లోకి విజయ్


రాజకీయ పార్టీలకు సినిమా గ్లామర్ తోడైతే ఎలా ఉంటుందనేది దక్షిణ భారత రాజకీయాల్లో అందరికీ బాగా తెలుసు. సినిమావాళ్లే గద్దెనెక్కి పాలించారు. అటు స్టార్లు కూడా పాలిటిక్స్ పై ఓ కన్నేసి ఉంచుతుంటారు. అయితే తరం మారింది. ఒకప్పుడు సినిమా గ్లామర్ కు ఓట్లు పడ్డాయి. ఇప్పుడు పడటం లేదు. పైగా వెండితెరపై ఎంతో క్రేజ్ ఉన్నా ప్రత్యక్ష్య రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. అందుకు మళయాలం నుంచి తెలుగు పరిశ్రమ వరకూ ఎందరో స్టార్లు ఉదాహరణలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందు నుంచీ సినిమా, రాజకీయాలు అంటూ కాస్త ఎక్కువ హాట్ గా కనిపించే తమిళ్ సినిమా పరిశ్రమలో తిరుగులేని స్టార్ గా ఉన్న ఇళయదళపతిని తమ పార్టీలోకి ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ.
కొన్నాళ్లుగా విజయ్ చేస్తోన్న సినిమాలన్నీ ఓ సోషల్ కాజ్ ను ఎరైజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా అధికార పార్టీలకు చురకలు వేసే సెటైర్స్ అండ్ సీన్స్ కూడా ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. రీసెంట్ గా ఐటి విభాగంతో సోదాలు చేయించి అతన్ని ఇబ్బందులకు గురి చేశారు. దీని వెనక ప్రధానంగా బిజెపి పార్టీ ఉందనేది అందరికీ తెలిసిన విషయం.
ఇలా జరిగింది అనే కాదు కానీ.. చాలాకాలం క్రితం నుంచే విజయ్ కి రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఉంది. అతని తండ్రితో పాటు కొందరు సన్నిహితులు కూడా ఈ ప్రయత్నాలు చేశారు. కాకపోతే ఆ టైమ్ లో సినిమా వారికి సరైన ఆదరణ లేదు. విజయ్ కాంత్ కేవలం ఒకే సీట్ కు పరిమితం అయ్యాడు. కమల్ ను, రజినీకాంత్ ను సైతం జనం నమ్మే పరిస్థితిలో లేరు. దీంతో విజయ్ కాస్త వెనకడుగు వేశాడు. బట్ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనే డిసైడ్ అయినట్టు సమాచారం.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంత పార్టీ పెట్టి నెట్టుకురావడం అసంభవం. అందుకే ఏదైనా మరో పార్టీలో చేరతాడు విజయ్ అనే ప్రచారం జరుగుతోంది. ఇది నిజమే అన్నట్టుగా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ విజయ్ కి రెడ్ కార్పెట్ వేస్తాం అంటోంది. ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలే ఇస్తాం అంటోంది. విజయ్ కాంగ్రెస్ లో చేరతాడు అనుకోలేం. బట్.. రాజకీయాల్లోకి వస్తాడని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Related Articles

Back to top button
Send this to a friend