కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్ రక్తదానం


సిల్వర్ స్క్రీన్‌పై కొరియోగ్రాఫర్‌గా, స్మాల్‌స్క్రీన్‌పై డాన్స్‌షోల జడ్జిగా… అంతకుమించి మెగాస్టార్‌ శ్రీ చిరంజీవి గారి వీరాభిమానిగా పేరొందిన శ్రీ శేఖర్‌ మాస్టర్‌ ఇవాళ రక్తదానం చేసారు.బ్లడ్‌బ్యాంక్‌కి వచ్చిన ఆయన చిరంజీవి ఇచ్చిన పిలుపునకు స్పందనగా రక్తదానం చేయడం ముదావహం.

ఇటీవల సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన మెగాస్టార్‌ శ్రీ చిరంజీవి గారి చిత్రాలు ‘ఖైదీ నంబర్‌ 150’, ‘సైరా’ చిత్రాల్లో పాటలకు శ్రీ శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫీతో ఆడియన్స్‌ని విపరీతంగా ఆకర్షించాయి.
‘ఖైదీ నంబర్‌ 150’లో ‘అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు’, ‘యూఅండ్‌మీ’ పాటలకు ఆయన కొరియోగ్రఫీ చేసారు. ‘సైరా’ చిత్రంలో కూడా ఒక సాంగ్‌కి ఆయన కొరియోగ్రఫీ చేశారు.

శ్రీ రామ్‌చరణ్‌ చిత్రాలు ‘బ్రూస్‌లీ’లో ‘కుంగ్‌ఫూ కుమారి’, ‘ఎవడు’లో ‘పింపుల్‌ డింపుల్‌’, ‘రంగస్థలం’ చిత్రంలో ‘ఎంత సక్కగున్నావే’& వినయ విధేయ రామ లో ‘ ఏక్ బార్ ఏక్ బార్ ‘ పాటలకు కూడా ఆయన కొరియోగ్రఫీ చేసారు. కొరటాల శ్రీ శివగారి దర్శకత్వంలో రాబోయే శ్రీ చిరంజీవి గారి చిత్రం ‘ఆచార్య’లోనూ ఓ ప్రధానమైన పాటకు శ్రీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

మెగాస్టార్‌ శ్రీ చిరంజీవిగారంటే ఎంతో అభిమానమని చెప్తూ రక్తదానం ఇవ్వడం సామాజిక బాధ్యతగా ఆయన పేర్కొన్నారు.

Related Articles

Back to top button
Send this to a friend