ఈ సారైనా హిట్ కొడతాడా..?


అన్ని రీమేక్ లూ వర్కవుట్ కావు. కొన్నిటికి నేటివిటీ ప్రధాన సమస్యగా ఉంటే మరికొన్ని బ్యాడ్ ఎగ్జిక్యూషన్ మూలంగా లాస్ అవుతాయి. అయితే అలాంటి సమస్యంలేం లేవు అనిపించేలా టాలీవుడ్ లో ఓ కొత్త రీమేక్ టీజర్ కనిపిస్తోంది. మామూలుగా ఆరంభం నుంచి మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న కుర్రాడు సత్యదేవ్. కానీ అతని టాలెంట్ ఎలివేట్ అవుతోన్నా రేంజ్ మారేంత పెద్ద సినిమాలు పడటం లేదు. పెద్ద సినిమాల్లో అతని పాత్రలన్నీ చనిపోతుంటాయి. మొత్తంగా ఇన్నాళ్లకు ఓ సినిమా అతని రేంజ్ మార్చబోతోందా అనిపిస్తోంది.
కేరాఫ్ కంచరపాలెం వంటి విమర్శకుల ప్రశంసలందుకున్న చిత్రంతో దర్శకుడుగా సత్తా చాటిన వెంకటేష్ మహా చేస్తోన్న సినిమా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. కంచరపాలెం నిర్మాత ప్రవీణతో పాటు బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కూడా నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. మళయాలంలో సూపర్ హిట్ అయిన ‘మహేశ్వరింతే ప్రతికారమ్’అనే చిత్రానికి అఫీషియల్ రీమేక్ ఇది. అక్కడ ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించాడు. ఇక్కడ ఆ పాత్రను సత్యదేవ్ చేస్తున్నాడు. అయితే ఇదే సినిమాను తమిళ్ లో ఉదయనిధి స్టాలిన్ చేశాడు. కానీ హిట్ అందుకోలేదు.
ఇక శివరాత్రి సందర్భంగా విడుదలైన ఉమామహేశ్వర టీజర్ వెరీ ఇంప్రెసివ్ గా ఉంది. ఏ మాత్రం చెడగొట్టకుండా ఒరిజినల్ కు తీసిపోకుండా చాలా హానెస్ట్ గా రూపొందిస్తోన్న సినిమా అని అర్థమౌతోంది. సత్యదేవ్ లుక్ కూడా చాలా బావుంది. దీంతో ఈ టీజర్ కు అద్బుతమైన ప్రశంసలు కూడా వస్తున్నాయి. మరి ఈ ప్రశంసలు కమర్షియల్ విజయానికీ కారణమైతే సత్యదేవ్ కు హిట్ పడుతుంది.

Related Articles

Back to top button
Send this to a friend