Home తెలుగు వర్షన్ ‘కామాఖ్య’ నుంచి సముద్రఖని ఫస్ట్ లుక్ రిలీజ్

‘కామాఖ్య’ నుంచి సముద్రఖని ఫస్ట్ లుక్ రిలీజ్


సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ ‘కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సింగిల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ సముద్రఖని ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘తిరుపతి’గా ఆయన పాత్రను పరిచయం చేశారు. ఆయన ప్రెజెన్స్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంది. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఫస్ట్ లుక్ సూచిస్తోంది.

ఈ చిత్రానికి గ్యాని మ్యూజిక్ అందించారు. రమేష్ కుశేందర్ రెడ్డి డీవోపీ, వరప్రసాద్ ఎడిటర్.

తారాగణం: సమైరా, సముద్రఖని, అభిరామి, ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య

కథ, దర్శకత్వం: అభినయ కృష్ణ
బ్యానర్: మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD
నిర్మాతలు: వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్
DOP: రమేష్ కుశేందర్ రెడ్డి
క్రియేటివ్ డైరెక్టర్: రిషాన్
సంగీతం: గ్యాని
ఎడిటర్: వరప్రసాద్
ఆర్ట్: భూపతి యాదగిరి
VFX: ఫణి విహారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీహరి గౌడ్
పీఆర్వో: వంశీ శేఖర్
డిజిటల్: హాస్టాగ్ మీడియా