అందుకే పోలీసులు కొట్టారు :: సల్మాన్ ఖాన్

వివాదం అయిన వినోదం అయిన బాలీవుడ్ లో ఎక్కువగా వార్తల్లో ఉండే హీరో సల్మాన్ ఖాన్.. బీయింగ్ హ్యూమన్ అనే సంస్థ ద్వారా సేవ కార్యక్రమాల లో కూడా ముందు ఉంటాడు సల్మాన్.ప్రస్తుతం లాక్ డౌన్ కారణం గా సల్మాన్ తన ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడు.తన ఫ్రెండ్ కి జరిగిన ఒక అనుభవాన్ని పంచుకుంటూ ఇన్ స్టా లో ఒక వీడియో సందేశం పంపాడు.
లాక్ డౌన్ రూల్స్ నీ ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని, అవసరం అయితే తప్ప బయటకి వెళ్లవద్దని హితవు పలికాడు.ఒకవేళ ఏదైనా పని మీద వెళ్ళినా తప్పని సరిగా రూల్స్ పాటించాలని మాస్క్ తప్పకుండా ధరించాలని సూచించారు.ఇక ఎవరితో అయిన మాట్లాడే సమయం లో కూడా మాస్క్ ను తియ్యకూడదని ,మాస్క్ ధరించే దూరం నుంచి మాట్లాడాలని చెప్పారు..

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

ప్రభుత్వం చెప్తున్న నియమ నిబంధనలు పాటించకపోయినా, అనవసరం గా బయట తిరిగినా పోలీసులు కొట్టడం లో తప్పులేదని అన్నాడు…ఎందుకంటే కరోనా ను కంట్రోల్ చేయడం కోసం వైద్యులు,ఆరోగ్య సిబ్బంది,పోలీసులు ఎంతో శ్రమిస్తూ ఉన్నారని వారికి సహకరించడం మన బాధ్యత అని అన్నాడు..కరోనా కారణం గా మన అందరి జీవితం bigboss షో లాగ మారిపోయిందని చమత్కరించారు సల్మాన్..అందుకే అందరూ ఇంటికే పరిమితం కావాలని కోరారు..

Related Articles

Back to top button
Send this to a friend