‘బొమ్మ బ్లాక్ బస్టర్’ నుండి రష్మీ ఫస్ట్ లుక్

యంగ్ టాలెంటెడ్ హీరో నందు, డ‌స్కీ బ్యూటీ ర‌ష్మీ గౌత‌మ్ జంట‌గా విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై ప‌వ్రీణ్ ప‌గ‌డాల‌, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డీ మ‌డ్డి, మ‌నోహార్ రెడ్డి ఈడా నిర్మాత‌లుగా రాజ్ విరాఠ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ప్రొడ‌క్ష‌న్ నెం 1 చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

తాజాగా పోతుగాడి లవర్ వాణి గా రష్మీ నటించనుంది. రష్మీ ఫస్ట్ లుక్ ను యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు విడుదల చేశారు. బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అనే టైటిల్ కి త‌గ్గ‌ట్లుగానే సినిమా కూడా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ప‌క్క‌గా ఎంట‌ర్ టైన్ చేస్తుంద‌ని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సినిమాలో నందు, ర‌ష్మీ క్యారెక్ట‌ర్ చాలా డిఫ‌రెంట్ గా ఉండబోతున్నాయి.

తారాగ‌ణం:
నందు, ర‌ష్మి, కీర్తి దామరాజు, రఘు కుంచె

సాంకేతిక వ‌ర్గం:

బ్యానర్ – విజయీభ‌వ ఆర్ట్స్
నిర్మాత – ప్ర‌వీణ్ ప‌గ‌డాల‌, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి మ‌డ్డి, మ‌నోహ‌ర్ రెడ్డి ఈడా
మ్యూజిక్ – ప్ర‌శాంత్ ఆర్ విహారీ
డిఓపి – సుజాతా సిద్ధార్థ్
ఎడిట‌ర్ – బి సుభాస్క‌ర్
పీఆర్ఓ – ఏలూరుశ్రీను
పబ్లిసిటి: ధని యేలే
డైరెక్ట‌ర్ – రాజ్ విరాఠ్

Related Articles

Back to top button