ప్రభాస్ అంత ఈజీ గా అర్దం కాడు..

రాజమౌళి తెలుగు సినిమా నీ బాహుబలి తో అంతర్జాతీయ స్థాయి లో నిలబెట్టిన దర్శకుడు.తను పని చేసిన నటీ నటుల ను ఫ్యామిలీ లాగ ట్రీట్ చేస్తూ ఉంటాడు.ఇటీవల తను ఇచ్చిన ఒక ఇంటర్వ్యు లో తనతో కలిసి పనిచేసిన వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు.
ప్రభాస్ తో తనకు తన కుటుంబానికి చాలా దగ్గరి వ్యక్తి అని,తనతో పనిచేస్తున్నప్పుడు చాలా సరదా జ్ఞాపకాలు ఉన్నాయని అన్నాడు .ఆ అభిమానం తోనే అనుకుంటా ప్రభాస్ 5ఏళ్లు బాహుబలి కోసం కష్ట పడ్డారు.

స్టూడెంట్ నంబర్ వన్ సినిమా టైమ్ లో తారక్ ను చూసి చిన్నపిల్లాడు అనుకున్నా కానీ సగం షూట్ అయ్యాక మాత్రం NTR టాలెంట్,తన లోని ఫైర్ చూశానని గుర్తుచేస్తున్నారు.తన లో ఉండే ఆ కసి మాటల్లో చెప్పలేం అన్నాడు జక్కన్న ..

మగధీర రామ్ చరణ్ కు మైల్ స్టోన్ మూవీ అనే చెప్పాలి.ఆ సినిమా షూటింగ్ టైమ్ లో రామ్ చరణ్ కు గాయం అయిందట,అయినా కూడా అది లెక్కచెయ్యకుండా అద్భుతం గా నటించడం చూసి రామ్ చరణ్ గొప్ప నటుడు అవుతాడని అప్పుడే అనుకున్నాడట..
అంతేనా సినిమా లో కనిపించే ప్రభాస్ కి నిజ జీవితంలో ప్రభాస్ కి పోలికే ఉండదు అన్నట్లు చెప్పారు.. తనకు ప్రభాస్ కి వ్యక్తి గతం గా చాలా బలమైన బంధం అని,తనను దూరం నుండి చూసే వాళ్ళు ప్రభాస్ చాలా సరదా గా ,సింపుల్ గా ఉంటాడని అనుకుంటారని కానీ తనతో క్లోజ్ గా ఉంటే తప్ప తనలోని గొప్ప వ్యక్తిత్వము అర్దం కాదని అది మన ఊహకి కూడా అందదని ప్రభాస్ ను ఆకాశానికి ఎత్తేశాడు.అందుకే నేమో ప్రభాస్ అందరికీ డార్లింగ్ అయ్యాడు..

Related Articles

Back to top button
Send this to a friend