మనిషి స్వేచ్ఛా జీవి అంటున్న మూర్తన్న

కరోనా ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ఒకటే మంత్రం కాదు అన్నారు ప్రముఖ నటులు ఆర్.నారాయణ మూర్తి.లాక్ డౌన్ ద్వారా దేశం లో కరోనా ను అరికట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నామని,దానిలో భాగంగా మే 3దాకా పొడిగించిన నేపథ్యంలో అందరం సహకరించడం మన బాధ్యత అంటూనే ,ఇదే సర్వస్వం కాదని కూడా అభిప్రాయ పడ్డారు.ముందు వైరస్ కు మందు ను కనిపెట్టాలని,మనుషుల్లో బ్రతుకు పై భరోసా కల్పించాలని సూచించారు. ఆకలి కి అలమటించి మనుషుల్లో నేర ప్రవృత్తి పెరిగే ప్రమాదం పొంచి ఉందని అన్నారు.అటువంటి విపత్కర పరిస్థితు లు రాకుండా ఉండాలంటే ప్రభుత్యం మే ముందుకు వచ్చి మందు ను కనిపెట్టలాలని అన్నారు..మిగతా దేశాల మాదిరిగా వైరస్ తయారీకి దేశీయంగా గా ప్రయోగాలు వేగంగా చేయాలని సూచించారు.. మనిషి స్వేచ్ఛా జీవి వైరస్ ను ఎదిరించి ఆరోగ్యం గా ,స్వేచ్ఛ గా బతికే రోజు ను ప్రభుత్వాలు కల్పించాలని భావోద్వేగం తో అన్నారు నారాయణ మూర్తి.దశల వారిగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలని ఎందుకంటే అది కరోనా కట్టడి కి మార్గమే కానీ మందు కాదు అని  ప్రభుత్వాలని వేడుకుంటూ నారాయణ మూర్తి  గారు మాట్లాడిన వీడియో ఇపుడు అనేకమందిని ఆలోచింప చేస్తుంది..

Related Articles

Back to top button
Send this to a friend