పవన్ కళ్యాణ్ తో ప్రాబ్లమ్స్ ఎన్నో!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. నిన్నటి వరకూ వెండితెర రారాజు. కానీ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఈ ప్రభ అక్కడ ఉపయోగపడలేదు. ఓ దశలో అసలు సినిమాలు చేయను అన్న పవన్ కళ్యాణ్ మనసు మార్చుకుని మళ్లీ వెండితెరపైకి వస్తున్నాడు. అంతేకాక.. అనూహ్యమైన వేగంతో దూసుకుపోతున్నాడు. ఆరంభంలోనే ఒకేసారి మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు. ఇందులోరెండు సినిమాలు షూటింగ్ కూడా ప్రారంభమైంది. ముందుగా బాలీవుడ్ హిట్ పింక్ రీమేక్ లాయర్ సాబ్ లో నటిస్తున్నాడు. ఇందులో ఆయన పాత్రకు సంబంధించి మాగ్జిమం షూటింగ్ అయిందంటున్నారు. మరోవైపు క్రిష్ డైరెక్షన్ లో విరూపాక్ష(వర్కింగ్ టైటిల్)లోనూ నటిస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాల మధ్య అతను పాలిటిక్స్ కు కూడా టైమ్ ఇస్తున్నాడు. అయితే ఈ టైమ్ ఎప్పుడు ఇస్తున్నాడో తెలియక వీళ్లు ఇబ్బంది పడుతున్నారట. వరుసగా రెండు రోజులు క్రూసియల్ టీమ్ తో షూటింగ్ అనుకుంటే.. ఆ రెండు రోజుల్లోనే ఏదైనా ఇష్యూ వస్తే వెళ్లిపోతున్నాడట పవన్. దీంతో అంతమంది ఆర్టిస్టులతో మళ్లీ కాల్షీట్స్ వేసుకోలేక రెండు సినిమాల టీములూ తెగ ఇబ్బంది పడుతున్నాయంటున్నారు. మరి ఈ విషయం పవన్ కు తెలుసో లేదో కానీ.. బయట మాత్రం నిర్మాతలకు లాస్ తప్పేలా లేదు అని చెప్పుకుంటున్నారు. నిజమే.. పెద్ద స్టార్ తో సినిమా అంటే ఆయనతో పాటు కాస్త ఇంపార్టెంట్ ఉన్న నటులే ఉంటారు. మళ్లీ వాళ్ల కాల్షీట్స్ సంపాదించాలంటే దర్శకుడికి తలకు మించిన భారం అవుతుంది. ఆ ఎఫెక్ట్ క్రియేటివ్ సైడ్ పడితే ఇక సినిమా రిజల్ట్ కూడా తేడా కొడుతుంది.

Related Articles

Back to top button
Send this to a friend