విలనే కానీ ..బయట మాత్రం కర్ణుడే…


విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.లాక్ డౌన్ ప్రకటించిన వెంటనే స్పందించి తన దగ్గర పనిచేసే వారికి జీతాలు ముందు గానే ఇచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.అంతే కాకుండా ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా వెయ్యి కుటుంబాల కు సహాయం చేశారు..అవసరం ఐన వారికి నిత్యావసర సరుకులను నేటికి పంపిణీ చేస్తున్నారు.మరీ ముఖ్యంగా తన ఫామ్ హౌస్ లో చాలా మందికి ఆశ్రయం కల్పించి వారి బాగోగులు చూసుకుంటున్నారు.ఐతే ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ అందరిని కదిలించింది.తన దగ్గర డబ్బు నిల్వ లు తగ్గిపోతున్నాయని ,అయినా కానీ తను సహాయం చేయడం మాననని అవసరమైతే లోన్ తీసుకుని ఐనా సాయపడతానని తెలిపారు. తాను మళ్ళీ సంపాదించుకోగలనని ,ఈ సమయంలో మానవత్వం తో అందరం కలిసి పోరాడుదామని పిలుపునిస్తూ ట్వీట్ చేశారు. ఐతే ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కు స్పందించి చాలా మంది ముందుకు వచ్చినా తాను విరాళాలు తీసుకునేందుకు సిద్ధంగా లేనని చెప్తూనే ,మీ చుట్టు పక్కల ఉన్న వారికి మీరే సహాయం అందించండి అని ట్వీట్ చేశారు..

Related Articles

Back to top button