దర్శకుడికి ప్రభాస్ వార్నింగ్

Prabhas instructions to Director

రెబల్ స్టార్ ప్రభాస్.. జనం అనుకుంటున్నంత ఆత్రంగా సినిమాలు చేయడం లేదు. హిట్, ఫ్లాప్ తో పనిలేకుండా తనకు నచ్చిన కథలకే ఓటేస్తున్నాడు. సాహో తర్వాత ప్రస్తుతం ఓ లవ్ స్టోరీతో రాబోతున్నాడు. ఒకే సినిమా చేసిన రాధాకృష్ణ డైరెక్షన్ లో రాబోతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ పూర్తిగా రొమాంటిక్ లుక్ లో కనిపించబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు గతంలో జాన్ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. బట్ జాను అనే సినిమా రావడంతో ప్రస్తుతం ‘ ఓ డియర్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. మొత్తంగా చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ కోసం దర్శకుడు చాలా ప్రయోగాలు చేస్తున్నాడట. అందులో భాగంగా ఎన్నో విఎఫ్ఎక్స్ షాట్స్ ను కూడా తీస్తున్నాడట.
కానీ ఇప్పటికే యూరప్ లో చిత్రీకరణ జరుపుకోవాల్సిన సినిమాను ఇక్కడే సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు. దీంతో నేచురాలిటీ పోకుండా చూసుకుంటూనే విఎఫ్ఎక్స్ షాట్స్ ఎక్కువ చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడట. దీంతో సహజత్వం దెబ్బతింటుందనేది ప్రభాస్ ఫీలింగ్ అంటున్నారు. ప్రభాస్ వంటి స్టార్ చెప్పిన తర్వాత దర్శకుడు ఫాలో కాకుండా ఉంటాడా..? అందుకే ఆయన ఇన్ స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ స్ట్రాటజీ మార్చుకుంటున్నాడట డైరెక్టర్ రాధాకృష్ణ.

Related Articles

Back to top button
Send this to a friend