ప్రభాస్ దసరా ధమాకా!


రెబల్ స్టార్ ప్రభాస్ .. కాస్త లేట్ అయినా ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే అన్న కసితో కనిపిస్తున్నాుడ. అందుకే రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న రాధేశ్యామ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఆఖరికి అంతా ఒకే అనుకున్న తర్వాతే సెట్స్ పైకి వెళ్లారు. యూరప్ బ్యాక్ డ్రాప్ లో 1960ల నేపథ్యంలో నడిచే ప్రేమకథగా రాబోతోన్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తతుం చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ముందుగా వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారు అనుకున్నారు. బట్ లేటెస్ట్ గా వినిపిస్తోన్నదాన్ని బట్టి ఈ యేడాదే దసరా బరిలో రాధేశ్యామ్ రాబోతోందంటున్నారు. అంటే అక్టోబర్ 16న అని ఖచ్చితమైన డేట్ కూడా వినిపిస్తోంది.
నిజానికి ఇప్పటి వరకూ దసరా టార్గెట్ గా ఇప్పటి వరకూ ఏ పెద్ద స్టార్ కూడా తమ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. బట్ ఆ టైమ్ లో రావడానికి మెగాస్టార్, కొరటాల శివ సినిమా ఉంది. విజయ్ దేవకొండ, పూరీ జగన్నాథ్ మూవీకీ ఛాన్స్ ఉంది. కానీ ప్రభాస్ బరిలో నిలిస్తే ఈ ఇద్దరూ పోస్ట్ లేదా ప్రీ పోన్ కు వెళ్లాల్సే ఉంటుంది. మరి ఈ డేట్ కు నిజంగానే వస్తాడా మళ్లీ ఏవైనా మార్పులుంటాయా అనేది చూడాలి.

Related Articles

Back to top button
Send this to a friend