ప్రభాస్ మరో యాభై లక్షలు ఇచ్చాడు

డార్లింగ్ స్టార్ ప్రభాస్ దాతృత్వంలో తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్నాడు. ఇప్పటికే కరోనా కట్టడిలో భాగంగా వివిధ ప్రభుత్వాలు చేస్తోన్న చర్యలకు సహాయ చర్యలకు మద్ధతుగా తను నాలుగు కోట్లు విరాళాలు ఇచ్చాడు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో యాభై లక్షలు అలాగే కేంద్ర ప్రభుత్వానికి మూడు కోట్ల రూపాయలు ప్రకటించాడు. ఇక ఇదే టైమ్ లో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సారథ్యంతో పరిశ్రమలోని పేద కళాకారులు, టెక్నీషియన్స్ ను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ చారిటీ సంస్థను స్థాపించాడు. ఇందుకోసం ఇప్పటికే తెలుగులోని చాలామంది ఆర్టిస్టులు విరాళాలు ఇస్తున్నారు. అయితే దీనికి కూడా ప్రభాస్ మరో యాభై లక్షలు ప్రకటించాడు. ఈ యాభై లక్షలతో ప్రభాస్ సాయం నాలుగున్నర కోట్లకు చేరింది.

ప్రస్తుతం షూటింగ్ లు లేక రోజువారీ వేతనంతో బ్రతుకు బండిని లాగించే సినీ కార్మికుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని మరింత పెద్దలు కూడా ముందుకు రావడంతో ఈ ఛారిటీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ మొత్తాన్ని పరిశ్రమలో ఎవరెవరికి ఎలా పంచాలి.. డబ్బు రూపంలో అందించాలా లేక సరకుల రూపంలో అందించాలా అనే విషయంలో చారిటీ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button