పెరిగితే ప్రమాదమే..

లాక్ డౌన్ లో 24గంటలు గా ఇంట్లో నే ఉండటం వల్ల మనం తినే ఆహారం విషయం లో శ్రద్ధ తీసుకోకపోతే బరువు పెరిగే అవకాశం ఉంది.సమయానుసారంగా తిండి,తినకపోవడం,టైమ్ కి నిద్ర పోకపోవడం కూడా ఊబకాయానికి కారణం అవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.అధిక బరువు వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందనటున్నారు.ఈ కరోనా సమయంలో శరీర బరువు పై మరింత శ్రద్ధ అవసరం అంటున్నారు వైద్యులు. ఇంటిపట్టునే ఉంటూ, కనీసం ౩౦ నిమిషాల పాటు వ్యాయామం ,యోగా చేయాలని సూచిస్తున్నారు.సరిపడినంత నిద్ర పోవడం వల్ల కూడా బరువు ని అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు.ఫోన్ లను విపరీతంగా వాడటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది అని దాని వల్ల కూడా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ గా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.అందుకే వీలైనంత ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

Related Articles

Back to top button