అధికారం కోసం రాలేదు – పవన్ కళ్యాణ్
Pawan Kalyan on Politics
సినిమా స్టార్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకుని ఆ క్రేజ్ ను పాలిటిక్స్ లో పెట్టుబడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే రాజకీయాల్లో నైతిక విలువలు పెంచేందుకే తను పాలిటిక్స్ లోకి వచ్చాను తప్ప.. అధికారం కోసం కాదు అంటూ ముందు నుంచీ చెబుతున్నాడు పవన్. బట్.. అతని మాటల్లో నిజాయితీని జనం పట్టించుకోలేదు. లేదా పట్టించుకునేంత నిజాయితీగా అతను లేడా అనేది పక్కన బెడితే లేటెస్ట్ గా బిజెపితో జట్టుకట్టిన ఈ గబ్బర్ సింగ్ లేటెస్ట్ గా పాలిటిక్స్ గురించి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేస్తున్నాడు.
‘నేను దేశానికి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను తప్ప.. అధికారం కోసం కాదు’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతే కాదు.. రాజకీయ పార్టీల అంతిమలక్ష్యం కూడా అధికారం కావొద్దనేది తన అభిప్రాయం అనేలా మాట్లాడాడు. ఇక యూత్ కూడా ఇంటర్నెట్ లో విజ్ఞానాన్ని వెదుకుతూ టైమ్ వేస్ట్ చేయడం కంటే జనాల్లోకి రావాలని.. సమాజంలో జరుగుతోన్న అన్ని అంశాలను గమనించాలని హితవు పలికాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ హితవు చెప్పేంత పెద్దరికాన్ని మిగుల్చుకున్నాడా అనేది కూడా పెద్ద ప్రశ్నే కదా..