గాయ‌నీ గాయ‌కుల‌కు ఆన్‌లైన్‌లో సంగీత పోటీలు

విజేత‌కు `తెలుగు డిజిట‌ల్ ఐడ‌ల్‌` టైటిల్ ప్ర‌దానం తెలుగు గాయ‌కుల ప్ర‌తిభ‌ను వెలికి తెచ్చే ప్ర‌య‌త్నంలో భాగంగా `తెలుగు డిజిట‌ల్ ఐడ‌ల్‌` ప్ర‌ప్ర‌థ‌మంగా అంత‌ర్జాతీయంగా గాయ‌నీ గాయ‌కుల‌కు తెలుగు పాట‌కు ప‌ట్టంకట్టే విధానంలో శాస్త్రీయ‌/ సి‌నీ/ల‌లిత సంగీత పోటీల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తోంది. దీనికి సంబంధించిన `లోగో`ను ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు అనూప్ రూబెన్స్ ఆవిష్క‌రించారు. ఈ పోటీల‌లో పాల్గొనే ఔత్సాహిక గాయ‌నీ గాయ‌కులు త‌మ త‌మ పేర్ల‌ను ఈ క్రింది వెబ్‌సైట్‌లో న‌మోదు చేసుకోగ‌ల‌రు.
www.telugudigitalidol.com
అంత‌ర్జాతీయంగా నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మం కేవ‌లం ఆన్‌లైన్‌లోనే వీక్షించ‌గ‌ల‌రు. ఇందులో పాల్గొనే గాయ‌నీ గాయ‌కుల వ‌యో ప‌రిమితి క‌నీసం 16 సంవ‌త్స‌రాలు. మొద‌టి రౌండులో ఎంపికైన వారికి ఈ మెయిల్ ద్వారా తెలుప‌బ‌డుతుంది. న‌మోదు చేసుకునే ఆఖ‌రు తేదీ ఆగ‌స్ట్ 31, 2020, 23.00 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే.
గ‌మ‌నిక‌: ప‌్రాథ‌మిక రౌండుకు రిజిస్ట్రేష‌న్ రుసుము ఉచితం. అభ్య‌ర్థులు తాము పాడిన శాస్త్రీయ‌/ స‌నీ/ల‌లిత గీతాల తాలూకు వీడియో నిడివి 2 నిమిషాల‌కు మించ‌కూడ‌దు. దీనిని అప్‌లోడ్ చేసి పంప‌గ‌ల‌రు. ఎటువంటి వాద్య స‌హ‌కారాలు లేనివిగా ఉండాలి. వీడియోలో దృశ్యం, స్వ‌రం చాలా సుస్ప‌ష్టంగా ఉండేలా పంపాలి. మిగ‌తా వివ‌రాలు వెబ్‌సైట్‌లో ల‌భ్య‌మ‌వుతాయి.
దేశ విదేశాల‌లో పేరు ప్ర‌ఖ్యాతులు గ‌డించిన శాస్త్రీయ సంగీత విధ్వాంసులు గురు శ్రీ‌వెజెర్స్ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, ప్ర‌ముఖ ల‌లిత సినీ సంగీత ద‌ర్శ‌కులు కొమ్మండుగు రామాచారి ఈ పోటీల‌లో న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తారు.
ప్ర‌తిభావంతులైన ఉత్త‌మ గాయ‌నీగాయ‌కుల‌ను విజ‌యోత్స‌వ ముగింపు స‌మావేశ కార్య‌క్ర‌మంలో తెలుగు చిత్ర సీమ‌లోని ప్ర‌సిద్ధ సినీ సంగీత ద‌ర్శ‌కుల‌చే `తెలుగు డిజిట‌ల్ ఐడ‌ల్‌` టైటిల్ గెలుచుకున్న వారితోపాటు ప్ర‌థ‌మ‌, ద్వితీయ విజేత‌ల‌ను ఎన్నుకుంటారు. వారిని ప్ర‌శంసా ప‌త్రంతోపాటు జ్ఞాపిక‌తో స‌త్క‌రిస్తారు. అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన గాయ‌నీ గాయ‌కుల‌కు రాబోయే చిత్రాల‌లో అవ‌కాశం ఇచ్చి చిత్రసీమ‌కు నూత‌న గాయ‌నీ గాయ‌కుల‌ను ప‌రిచ‌యం చేయ‌గ‌ల‌న‌ని ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్ తెలిపారు.

Related Articles

Back to top button
Close
Send this to a friend