ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ మృతి

Noted Bollywood Actor Irfaan Khan passed away

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌(53) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా ఇర్ఫాన్‌ఖాన్‌ అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 2018 మార్చిలో తన అనారోగ్య పరిస్థితిపై తొలిసారిగా ప్రకటన చేశారు. శనివారం రాజస్థాన్‌లోని జయపురంలో ఇర్ఫాన్‌ తల్లి సయీదా బేగం(95) మృతి చెందారు. లాక్‌డౌన్‌ కారణంగా ముంబయిలోనే చిక్కుకుపోయిన ఇర్ఫాన్‌ తల్లి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోయారు.ఇటీవల ఇమ్రాన్ నటించిన ఇంగ్లీష్ మీడియం సినిమా మంచి విజయం సాధించగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. విభిన్న పాత్రలు పోషిస్తూ విలక్షణమైన నటనతో మంచి పేరు సాధించిన ఇమ్రాన్ మరణం సినీ పరిశ్రమ కి పెద్ద లోటే.లాక్ డౌన్ కారణంగా అంత్యక్రియలకు వెళ్లే వీలు లేదు కాబట్టి సోషల్ మీడియా సందేశం ద్వారా నే సంతాపం తెలుపుతున్నారు పలువురు.

Related Articles

Back to top button
Send this to a friend