మహేష్ కాదు.. రామ్ చరణే ఫిక్స్ ..!


కొన్ని డైలమాలు రకరకాల వార్తలకు కారణమవుతాయి. ఈ మధ్య కాలంలో ఇలా వచ్చిన డైలమా.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నాడు అని. అయితే ఈ వార్త నిజం. కొరటాల శివ ఓ కీలక పాత్ర కోసం మహేష్ బాబుకు కథ చెప్పాడు. అతను ఒప్పుకున్నాడు. భారీ రెమ్యూనరేషన్ అడిగితే ‘సిట్యుయేషన్ డిమాండ్ మేరకు’నిర్మాత రామ్ చరణ్ కూడా ఓకే చెప్పాడు. కాకపోతే ఈ కాంబినేషన్ చిరంజీవికి మొదటి నుంచీ ఇష్టం లేదుట. నిజానికి ముందు నుంచీ రామ్ చరణ్ తోనే చేయించాలనుకున్నారు. కానీ రాజమౌళి వద్దన్నాడు. తనకంటే ఈ సినిమా ముందు విడుదలైతే ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ పాత్ర తేలిపోతుందని రాజమౌళి ఫీలింగ్. అందుకే ఆల్టర్ నేటివ్ గా మహేష్ వైపు వెళ్లారు.
కానీ మహేష్ ఎంటర్ అయితే అతని కోసం ఎలివేషన్ సీన్స్ ఉండాలి. అతని ఫ్యాన్స్ ను శాటిస్ ఫై చేసే సీన్స్ కూడా ఉండాలి. అప్పుడు మెగా ఛరిష్మా కొంత డైల్యూట్ అవుతుంది. అది చిరంజీవి భావన. అలాగే తనకు కొడుకుతో కలిసి నటించేందుకు ఇంత మంచి స్క్రిప్ట్ మళ్లీ దొరుకుతుందా అనే ఫీలింగ్ కూడా ఉంది. అందుకే ఏమైతే అదైందని రామ్ చరణ్ తోనే ఈ పాత్ర చేయిస్తున్నారు. దీంతో సినిమా ఈ దసరాకు కాకుండా వచ్చే సమ్మర్ కు వస్తుంది. అయినా ఫర్వాలేదనేది చిరంజీవి అనుకుంటున్నాడు. ఒకవేళ సినిమా చూశాక రాజమౌళి ఓకే అంటే దసరాకే రావొచ్చు.
మొత్తంగా ఇన్నాళ్లూ మహేష్ బాబు అనుకున్న పాత్రను మొదట కమిట్ అయినట్టుగా రామ్ చరణ్ తో చేయిస్తున్నారు.

Related Articles

Back to top button
Send this to a friend