జగన్ ను పిలవకపోతే రాష్ట్రానికి నష్టమా..?

ప్రపంచ దేశాలను తనదైన శైలిలో కంట్రోల్ చేసే పెద్దన్న అమెరికా దేశ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టైమ్ ఇండియాకు వస్తున్నాడు. కూడా కూతురు ఇవాంకా కూడా వస్తోంది. ఆయన గుజరాత్ పర్యటన చేస్తాడు అని ముందే షెడ్యూల్ చేసుకున్నారు. ట్రంప్ కు భారీ స్థాయిలో ఆహ్వానం ఇచ్చేందుకు ఇప్పటికే పిఎమ్.ఓ అన్ని ఏర్పాట్లతో రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ట్రంప్ తో విందుకు పిలిచాడు ప్రధాని నరేంద్రమోడీ. ఇందులో తెలంగాణ సిఎమ్ కేసీఆర్ ఉన్నాడు.కానీ ఆంధ్రప్రదేశ్ సిఎమ్ జగన్మోహన్ రెడ్డి లేడు. దీంతో అక్కడి ప్రతిపక్షాలు ఇదేదో రాష్ట్రానికే పెద్ద ఉపద్రవంలా ఫీలవుతున్నాయి. విందుకు వెళ్లలేని ముఖ్యమంత్రి కూడా ఓ ముఖ్యమంత్రేనా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ముఖ్యమంత్రిగా జగన్ ఫెయిల్ అయ్యాడు అనడానికి ఇంతకు మించి నిదర్శనం లేదంటూ ఇష్టానికి మాట్లాడేస్తున్నారు. అదే టైమ్ లో దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి. నరేంద్రమోదీ ఎంతమంది ముఖ్యమంత్రులను ఆహ్వానించాడు అనేది మాత్రం మరిచారు. జగన్ కు రాజకీయ నాయకుడుగా అంత సీనియారిటీ లేదు. అటు బిజెపితో పొత్తలోనే ఉన్నాడు. అయినా పిలవలేదుంటే కారణం.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ముఖ్యమంత్రి చాలు అనుకుని ఉండొచ్చు. దానికీ పరిపాలనకూ లింక్ పెట్టడం మాత్రం ఖచ్చితంగా అవివేకం.
ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ఇతర సమస్యలను గాలికి వదిలేసికేవలం అమరావతి కేంద్రంగానే పనిచేస్తోంది. దీంతో వీళ్లు విమర్శలు చేసినా సాధారణ జనం పట్టించుకునే పరిస్థితిలో లేరనేది నిజం. మొత్తంగా ట్రంప్ తో విందుకు జగన్ ను పిలవకపోవడానికి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అవడానికి ఉన్న లింకేంటనేది మాత్రం ఖచ్చితంగా టిడిపి ఆలోచించాలి.

Related Articles

Back to top button
Send this to a friend