గురు భక్తి చాటిన నాని


అష్టా చెమ్మా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఈ సినిమా తో నే నాని హీరో గా సినీరంగ ప్రవేశం చేశాడు.మొదటి సినిమాలోనే నాని లో ఉన్న నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు ఇంద్రగంటి.ఈ సినిమా అందించిన విజయం నాని కి మంచి అవకాశాలు కల్పించింది. నాని కూడా తన లోని నటనకు పదును పెడుతూ మంచి గుర్తింపు ను తెచ్చుకుని హీరో గా నిలదొక్కుకున్నాడు..తర్వాత ఈ ఇద్దరి కాంబనేషన్ లో వచ్చిన జెంటిల్ మెన్ సినిమా కూడా మంచివిజయాన్ని అందుకుంది.
ఇపుడు ‘V’ సినిమా తో హ్యాట్రిక్ కొట్టే పనిల్లో ఉన్నారు నాని,ఇంద్రగంటి.ఈ సినిమా లో సుధీర్ బాబు మరో హీరో.కరోనా కారణం గా విడుదల ఆగిపోయినా ప్రేక్షకుల లో ఈ సినిమా పై అంచనాలు మాత్రం భారీగా నే ఉన్నాయి…అయితే తనను ఇండస్ట్రీ కి పరిచయం చేసిన ఇంద్రగంటి కి బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నాని తన మనసు లోని మాట ను ట్విట్టర్ లో బయట పెట్టాడు.. తన 50 వ సినిమా ను మీరే డైరెక్ట్ చేయాలి సార్,ఇంకా మీ 25 వ సినిమా లో నేనే నటించాలి అని..తర్వాత గ్రాండ్ గా పార్టీ చేసుకుందాం అని కూడా చెప్పారు నాని..ఎంత హుందాగా తన గురు భక్తి చాటాడు,ఎంతైన మన నాని జెంటిల్ మేన్ కదా…ఏమంటారు..

Related Articles

Back to top button
Send this to a friend