గచ్చిబౌలి లో ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్..

లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునేందుకు భేటీ అయిన తెలంగాణా కేబినెట్ అనేక అంశాల మీద దృష్టి పెట్టింది.ఆరోగ్యం,వ్యవసాయం,విద్య,వైద్యం,క్రీడలు,పరిశ్రమలు, వ్యాపారం ఇలా అనేక రంగాల బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంది.
వాటిలో భాగంగానే
*ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్ లను,వైద్య సిబ్బంది నీ అభినందిస్తూ వారికి ఏ ఇబ్బందీ లేకుండా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
*ప్రస్తుతం కోవిడ్ ఆసుపత్రి గా ఉన్న గచ్చిబౌలి క్రీడా కాంప్లెక్స్ ను క్రీడా శాఖ ఆధీనంలో నుండి ఆరోగ్య శాఖ కు బదిలీ చేసింది.
*9 ఎకరాల లో ఉన్న 14 అంతస్తుల నిర్మాణం లో 540గదులను భవిష్యత్తులో పూర్తిస్థాయి ఆసుపత్రి గా మార్పు అదనంగా 15 ఏకరాలు కేటాయింపు కి నిర్ణయం తీసుకున్నారు.
*తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ సెంటర్ గా పేరు మార్పు (TIMS)
*హాస్పిటల్ కు అనుబంధం గా మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపట్టనున్నారు.
*భవిష్యత్తు లో 750పడకలతో జెనరల్ హాస్పిటల్,750 పడకలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు కి నిర్ణయం తీసుకున్నారు.
*ఈ బాధ్యతను వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు అప్పగించిన ప్రభుత్వము..

క్రీడా భూమిని అరోగ్య శాఖ కు బదిలీ చేసిన నేపథ్యం లో రాష్ట్రం లో ఉన్న క్రీడా మైదానాలు, స్టేడియం లు,క్రీడా శాఖ కు చెందిన భూములను గుర్తించి వాటిని అభివృధి చేసి వినియోగం లోకి తీసుకువచ్చేందుకు ఒక కేబినెట్ సబ్ కమిటీ నీ కూడా నియమించింది ప్రభుత్వము..
* తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ సిటీ గా అభివృధి చేయాలని ప్రభుత్వము సంకల్పించింది..
*క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వం లో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి గా ktr, ఎర్రబెల్లి దయాకరరావు,సబితా ఇంద్రా రెడ్డి లను నియమించింది..

Related Articles

Back to top button
Send this to a friend