బిగ్ బీ కు మెగా ధన్యవాదాలు

కరొన పై ప్రజల్లో అవగాహన కల్పించేందు భారతీయ చిత్ర పరిశ్రమ కు చెందిన అనేక మంది నటులతో కలిసి ఒక వీడియో సందేశం లో నటించారు అమితాబ్ బచ్చన్.ఇప్పుడు మరొక్క సారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు బిగ్ బీ. ఇప్పుడు టాలీవుడ్ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన అమితాబ్ కు మెగా స్టార్ ధన్యవాదాలు తెలిపారు..ట్విట్టర్ వేదికగా చిరు బిగ్ బి పై తన కృతజ్ఞత చాటుకున్నారు. కష్ట కాలం లో ఉన్న సినీ కార్మికులకు అండగా ఉండి ఆదుకునేందుకు CCC నీ స్టార్ట్ చేశారు చిరంజీవి.ఇప్పుడు చిరు స్ఫూర్తి తో అమితాబ్ కూడా తెలుగు సినీ పరిశ్రమ లోని సినీ కార్మికులకు కోటి 80లక్షల సాయాన్ని విరాళంగా ఇచ్చి పెద్దమనసు చాటుకున్నారు అమితాబ్..ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు చిరు.1500రూపాయల విలువైన 12వేల కూపన్లను బిగ్ b విరాళంగా అందజేశారు.ఈ కూపన్ ద్వారా సదరు వ్యక్తి బిగ్ బజార్ లో షాపింగ్ చేసి 1500 విలువ చేసే తమకు కావలసిన వస్తువులను పొందవచ్చు…12వేల మంది సినీ కార్మికులకు ఈ కూపన్ లను అందజేయనున్నారు.

చిరంజీవి స్టార్ట్ చేసిన CCC(carona crisis charity) కి ఇప్పటికే అనేక మంది సినీ పరిశ్రమ కు చెందిన వారు విరాళాలు ప్రకటించి కార్మికులను ఆదుకునేందుకు తమ వంతుగా సహాయం చేస్తున్నారు.ఆ విరాళాల ద్వారా వచ్చిన మొత్తాన్ని నిత్యావరాల పంపిణీ, ఆహారపదార్థాల పంపిణీ వంటి అనేక కార్య్రమాలకు వినియోగిస్తున్నారు..రాష్ట్రాలతో , భాష తో సంబంధం లేకుండా చిత్ర పరిశ్రమ అంతా ఒకే కుటుంబం అని అందుకే పెద్ద మనసుతో అమితాబ్ సాయం చేశారని చిరు తన ట్విట్టర్ వేదికగా తెలియచేశారు…

Amit ji @SrBachchan has arranged 12000 Corona Relief Coupons of Rs1500 each to be distributed to the Daily wage Film workers in Telugu States from the proceeds of #Family.A BIG THANK YOU to ‘BIG B’ for this wonderful initiative.These coupons can be redeemed at #BigBazaar stores pic.twitter.com/XK0vjL38MT
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 17, 2020

వినోదాన్ని పంచడం లోనే కాదు అవసరానికి ఆదుకోవడం లో కూడా తాము హీరో లమే అని నిరూపిస్తున్నారు మన నటీ నటులు..

Related Articles

Back to top button