బతికుంటే బలుసాకు తినవచ్చు: మంగ్లి


కరోనా పై అవగాహన కల్పించేందుకు ఫోక్ సింగర్ మం కొద్దిసేపటి క్రితమే సాంగ్ ను రిలీజ్ చేశారు..రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే వేలల్లో వ్యూస్ ను సంపాదించింది ఈ పాట.. “”పైస పోతే పోనీ గాని ప్రాణం ఉంటే చాలు అన్నా “”అంటూ సాగే ఈ పాట ఆలోచింప చేసేలా ఉంది..అన్ని మతాల ప్రార్ధనాలయాలు మూత పడిన వేళ రక్త సంబంధం లేకపోయినా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న డాక్టర్ లే మనకు దేవుళ్ళు వాళ్లు చెప్పిన మాట  విని ప్రాణాలు కాపాడుకుందాం అంటూ సాగే తీరు మనసును హత్తుకుంది..శుభ్రత పాటిస్తూ,భౌతిక దూరం అనుసరిస్తూ ఇంట్లోనే ఉంటే దేశం కూడా చల్లగా ఉంటుందనే సందేశాన్ని ఇచ్చారు గీత రచయిత కసర్ల శ్యామ్..అంతే కాకుండా సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ కష్ట కాలం లో పుకార్లు రేపకండి అనే సామాజిక సందేశాన్ని ఈ పాట తో సమాజానికి అందించారు…మంగ్లి తో కలిసి గీత రచయిత శ్యామ్ తో పాటు శ్యామ్ కొడుకు కూడా గొంతు కలిపారు ఈ పాట లో..బిగ్ బాస్ విన్నర్ రాహుల్ శిప్లిగాంజ్ కూడా  పాట లో తళుక్కున మెరిశాడు..మొత్తానికి సందేశాత్మకంగా ఉన్న ఈ పాట వినగానే మనకు మన బాధ్యత ను గుర్తుచేసే విధం గా ఉంది..అందుకే ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Related Articles

Back to top button
Close
Send this to a friend