మహేష్ బిజినెస్ మేన్ గా మరో అడుగు!

లాక్ డౌన్ తో షూటింగ్ లు ఆగిపోయినా,సినిమా లకు సంబంధించిన వార్తలు , పుకార్లు మాత్రం ఆగడం లేదు..ఇపుడు మహేష్ నెక్ట్స్ మూవీ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు షికారు చేస్తోంది.మహేష్ తన తరువాతి చిత్రం హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్నాడు అనేది ఇపుడు హాట్ టాపిక్.
దీనికి కారణం ప్రస్తుతం మహేష్, నమ్రత డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారట.దీనికోసం కేవలం డైరెక్షన్ మీదనే కాకుండా కథా రచన మీద పట్టు ఉన్న డైరెక్టర్ కోసం వెతుకుతున్నారు.హరీష్ శంకర్ అయితే తమ అంచనాలకు ,ఆలోచనలకు న్యాయం చేయగలుగుతారు అని భావిస్తున్నారట మహేష్ ఇంకా నమ్రత .అందుకే ఇప్పటికే మహేష్ నుండి హరీష్ కు పిలుపు కూడా అందిందని హరీష్ కథ ను రెడీ చేసే పనిలో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
ఎంతైనా ఇపుడు Netflix లాంటి వాటిని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు..ఆసక్తి కలిగించే కంటెంట్ తో ముందుకు వస్తే మహేష్ బిజినెస్ మేన్ గా బాగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయనే చెప్పాలి..

Related Articles

Back to top button
Send this to a friend