మహేష్ కోసం రాయబారాలు మొదలయ్యాయ్


ఊహించినట్టుగానే ఇది రూమర్ కాదు. నిజమే. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోయింది. ముందు ముందు సెట్ అయ్యే అవకాశాలు కూడా లేవు అంటున్నారు. మహర్షి వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. అలాగే మహర్షి టైమ్ లోనే వంశీ చెప్పిన ఓ లైన్ నచ్చి సరిలేరు తర్వాత నీతోనే సినిమా అన్నాడు. సరిలేరు విజయం అయ్యాక.. తను అమెరికా వెళ్లి తిరిగి వచ్చాడు. కానీ వంశీ మాట తప్పాడు. తను చెప్పినట్టుగా కథ లేదు. పైగా అస్సలు బాలేదట. ఈ కారణంగానే వంశీకి చెక్ పెట్టాడు మహేష్.
ఇక వెంటనే మరో సినిమా అంటే ఇప్పుడు ఏ స్టార్ డైరెక్టర్ కూడా ఖాళీగా లేడు. దీంతో తనకు గతంలో కథ చెప్పిన పరశురామ్ తోనే సినిమాకు సిద్ధమవుతున్నాడు. మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమా కోసం పరశురామ్ సిద్ధంగానే ఉన్నాడు. కానీ అతను ఆల్రెడీ నాగచైతన్యతో సినిమాకు 14 రీల్స్ వాళ్లతో కమిట్ అయ్యి ఉన్నాడు. దీంతో మరికొంతమంది సినిమా పెద్దలు రంగంలోకి దిగబోతున్నారు.
మహేష్ కోసం పరశురామ్ ను 14 రీల్స్ వాళ్లు మినహాయించుకునేలా చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఆల్రెడీ రాయబారాలు మొదలయ్యాయట. ఆ బ్యానర్ తో మహేష్ కు కూడా మంచి రాపో ఉంది. సో ఫ్యూచర్ లో వారికో సినిమా చేయడానికి ఒప్పుకున్నా.. లేదంటే పరశురామ్ ను కొంత కాలం పాటు వీళ్లకు ఇచ్చేలా చేసినా.. అదీ కుదరదంటే ఇప్పుడు మైత్రీ మూవీస్ తో పాటు వాళ్లూ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అయినా 14రీల్స్ కు ఇబ్బందేం ఉండకపోవచ్చు. మొత్తంగా మహర్షిని వదిలేసిన గోవిందం దర్శకుడికే కమిట్ అయ్యే సిట్యుయేషన్ కు వచ్చాడు మహేష్ బాబు.

Related Articles

Back to top button
Send this to a friend