మహేష్ బాబు మళ్లీ షాక్ ఇచ్చాడా..?


మహేష్ బాబు క్యాంప్ లో ఇప్పుడు చాలా పరిణామాలున్నాయి. కథ ఓకే చేయాలంటే ముందుగా ఆయన సతీమణికి నచ్చాలి. నమ్రత ఓకే చెబితే తప్ప ఆ క్యాంప్ లోకి కనీసం కథ చెప్పడానికి కూడా ఎవరికీ పర్మిషన్ లేదు. ఆ రేంజ్ లో తమ వ్యాపారాల్లో నిమగ్నమై ఉంది నమ్రత. అందుకే కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నమ్రత ఓకే చెప్పిన తర్వాతే మహేష్ బాబు కథ వింటాడు అనే పుకారు ఉంది. దీన్ని మహేష్ చాలాసార్లు కొట్టిపారేసినా.. అదే నిజం అంటారు అతని సన్నిహితులు. మొత్తంగా రీసెంట్ గా సుకుమార్ తో సినిమా విషయంలో అనేక పరిణామాల మధ్య కటీఫ్ చెప్పిన మహేష్ ఈ సారి దర్శకుడు వంశీ పైడిపల్లికి కూడా షాక్ ఇచ్చాడు అనే వార్తలు వస్తుండటం ఆశ్చర్యం.
మహర్షి వంటి ఎపిక్ మూవీ నా కెరీర్ లోనే ది బెస్ట్ అని చెప్పుకున్నాడు మహేష్ బాబు. అలాంటి సినిమా ఇచ్చిన దర్శకుడికి వెంటనే ఛాన్స్ ఇచ్చిన కారణం కూడా అదే. మధ్యలో సరిలేరునీకెవ్వరు హిట్ అనిపించుకున్నా.. అందులో అంత సీన్ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సారి వంశీ కూడా కథ విషయంలో పూర్తి క్లారిటీగా లేడట. ఇప్పటికే సరిలేరుతో కొంత విమర్శలు కూడా ఫేస్ చేశాడు మహేష్. అందుకే వంశీ చెప్పిన లైన్ నచ్చినా.. దాన్ని మంచి కథగా డెవలప్ చేయడంలో అతను ఫెయిల్ అయ్యాడని.. అందుకే అతన్ని హోల్డ్ లో పెట్టేసి మరో దర్శకుడితో వెళ్లొచ్చు అనే డైలాగ్స్ వినిపిస్తున్నాయి. మరి వీటిలో వాస్తవాలేంటనేది ఆ టీమ్ నుంచి ఎవరో ఒకరు అఫీషియల్ గా స్పందిస్తే తప్ప తెలియదు.

Related Articles

Back to top button
Send this to a friend