రక్తదానానికి రెడీ అంటున్ననిర్మాత కూతురు

కరీమ్ మొరానీ,ప్రముఖ బాలీవుడ్ నిర్మాత.ఇటీవల తన పేరే కాదు తన కూతుళ్ళ పేర్లు కూడా వార్తలలో బాగా వినిపించాయి.కారణం వారు కోవిడ్ పేషెంట్స్ కావడమే.ఐతే వారంతా ట్రీట్మెంట్ తీసుకుని,ఆరోగ్యం గా కోలుకుని ఇంటికి చేరుకున్నారు.వైరస్ నుండి కోలుకున్న వారి ప్లాస్మా లోని యాంటీబాడీస్ ఇతరులకు చికిత్స లో బాగా ఉపయోగపడతాయని వైద్యులు చెప్తున్నారు కాబట్టి కోలుకున్న వారు రక్త దానం చేయాలని పలువురు బాలీవుడ్ నటులు పిలుపునిచ్చిన నేపధ్యం లో మొరానీ కుమార్తె, నటి జోయా “” నేను,చెల్లి,నాన్న రక్తదానం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, ఈ వీకెండ్ మేము డొనేట్ చేస్తున్నాం”” అని తెలిపింది..నెగటివ్ వచ్చిన 14 రోజుల తర్వాత నుండి మాత్రమే రక్తదానం చెయ్యవచ్చు అని వెైద్యులు చెప్పారని అంటోంది జోయా మొరానీ.

Related Articles

Back to top button
Send this to a friend