పవన్ కోసం మహానటిని భలే సెట్ చేశాడే!


పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత అతని సినిమాకు సంబంధించిన ప్రతిదీ ఓ పెద్ద వార్తే అవుతోంది. అఫ్ కోర్స్ ఏ పెద్ద హీరో సినిమాకైనా ఇవి కామనే అనుకోండి. ఇక వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతోన్న పవన్ ఇప్పుడు పూర్తి చేస్తోన్న లాయర్ సాబ్ ఈ సమ్మర్ లో మే నెలలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాపై బిజినెస్ వర్గాల్లో పెద్దగా బజ్ లేదు. కేవలం తెలుగు ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభం అయిన ‘విరూపాక్ష’(వర్కింగ్ టైటిల్) ఓ ఫిక్షనల్ డ్రామా. పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడట. ఇప్పటి వరకూ క్రిష్ కు భారీ కమర్షియల్ హిట్ లేదు. అతని కథలూ అలా కనిపించవు. కానీ ఈ సారి మాత్రం మిస్ అయ్యే ఛాన్సే లేకుండా ఓ అద్భుతమైన స్క్రిప్ట్ తో వస్తున్నాడంటున్నారు.
ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకున్నారనే ప్రచారం మొదలైంది. మొన్నటి వరకూ రష్మిక మందన్నా అన్నారు. కానీ పాత్రలో ఉండే వెయిట్ ను బట్టి కీర్తి వంటి స్టార్ అయితేనే కరెక్ట్ అని తనను సంప్రదించారట. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ తో కీర్తిసురేష్ చేసిన అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినా వీరి కెమిస్ట్రీ బానే ఉంటుంది. అందుకే కీర్తి కూడా వెంటనేఓకే చెప్పిందని వినిపిస్తోంది. మొత్తంగా హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుందనేది చిత్ర వర్గాల వస్తోన్న సమాచారం. మరి ఈ సారి పవన్ అండ్ కీర్తి ఏ తరహా పాత్రల్లో కనిపిస్తాడో చూడాలి. అన్నట్టు ఈ మూవీ షూటింగ్ కూడా జరుగుతూనే ఉంది.

Related Articles

Back to top button
Send this to a friend