మహేష్ బాబుతో మహానటి ..!

మహానటిగా కీర్తి తెచ్చుకున్నా .. ఆఫర్స్ విషయంలో అందలం ఎక్కలేకపోతోంది కీర్తి సురేష్. అంతకుముందు రెగ్యులర్ హీరోయిన్ గా ఆకట్టుకుంటూ టాప్ ప్లేస్ లోకి వెళుతుంది అనిపించుకుంది. కానీ అలా జరగలేదు. ఇక మహానటి సినిమాలో సావిత్రిని మరిపించిన కీర్తికి తెలుగులో గ్యాప్ వచ్చింది. ఎందుకంటే తను అంతకు ముందే తమిళ్ లోకొన్ని సినిమాలు ఒప్పుకుంది. వాటిని కంప్లీట్ చేసే టైమ్ లో తెలుగులో ఆఫర్స్ పోయాయి. పోనీ తమిళ్ లో సెట్ అవుతుందనుకుంటే తను చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో మళ్లీ పాయింట్ వన్ నుంచి మొదలుపెట్టింది. ప్రస్తుతం తెలుగులో రంగ్ దే, మిస్ ఇండియాతో పాటు తమిళ్ లో రెండు, మళయాలంలో ఒక సినిమా చేస్తోంది..
తెలుగులో నితిన్ సరసన చేస్తోన్న రంగ్ దే మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఊహించినట్టుగానే ఆకట్టుకునేలా ఉందీ లుక్. అయితే తన రేంజ్ మారాలంటే ఈ మూవీ పెద్ద హిట్ కావాలి. అయితేనే నెక్ట్స్ లీగ్ లోకి వెళుతుంది. అందుకే రంగ్ దే పై చాలా హోప్స్ పెట్టుకుంది. అయితే ఈ లోగా వినిపిస్తోన్న మరో వార్తేంటంటే.. తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఆఫర్ వచ్చిందని. పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ బాబు చేయబోతోన్న సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం.
పరశురామ్ సినిమాల్లో హీరోయిన్లకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ దర్శకుడు కీర్తి సురేష్ ను ప్రపోజ్ చేశాడట. అందుకు మహేష్ బాబు కూడా ఓకే చెప్పాడని టాక్. దీంతో కీర్తితో సంప్రదింపులు మొదలయ్యాయి అంటున్నారు. అంటే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడం ఒకటైతే.. హీరో మహేష్ బాబు వల్ల తనకు ఖచ్చితంగా పెద్ద ప్లస్ అవుతుంది. అందుకే ఈ సినిమాతో కీర్తి కెరీర్ కు ఓ పెద్ద బ్రేక్ వస్తుందంటున్నారు. విశేషం ఏంటంటే ముందుగా ఈ పాత్రలో రష్మిక మందన్నాను తీసుకోవాలనుకున్నారు. కానీ సరిలేరులో అమ్మడు మహేష్ సరసన తేలిపోయింది. అందుకే కీర్తి వైపు వెళుతున్నారు. మరి కీర్తి ఈ మూవీకి ఓకే చెబితే తన కెరీర్ కుచాలా ప్లస్ అవుతుందన్న విషయం తెలియనంత అమాయకురాలు కాదు కదా..? సో మహేష్ తో కీర్తి సురేష్ దాదాపు కన్ఫార్మ్ అయినట్టే అనుకోవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button