సామెత కాదు నిజమే.. భళా బలుసాకు..

బతికుంటె బలుసాకు తినొచ్చు,ఇది ఈ మధ్య కె.సి.ఆర్ అనడంతో బాగా పాపులర్ అయింది కానీ ఇది ఎప్పటి నుండో మన తెలుగు వారు విరివిగా వాడెే సామెత.బలుసాకు అంటే బలుసు చెట్టు ఆకు.పొలాల గట్ల మీద విరివిగా పెరుగుతాయి.చిన్న చిన్న ఆకులు, ముళ్ళ తో పొదలా పెరుగుతుంది .పల్లె ల్లో కొన్ని చోట్ల ప్రత్యేకంగా వినాయక చవితి రోజు ఈ ఆకు తో పులుసు ,పప్పు వండుకుని తింటారు.ఈ చెట్టు కాయలను కూడా తింటారు. రేగు పండు మాదిరి గా ఉంటాయి కాయలు. ఎక్కువగా ఈ ఆకులను ఆయుర్వేద మందుల తయారీ లో ఉపయోగిస్తారు. బలుసు ఆకులు ఆకలి ని పెంచడమే కాక, అతిసార వ్యాధి ని తగ్గిస్తాయి. ఈ చెట్టు వేర్లు కొన్ని రకాల పాము ల విషానికి విరుగుడు గా పని చేస్తాయి.అందుకే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే బతకుంటే బలుసాకు అయిన తినవచ్చు .ముందు ప్రాణాల తో మిగిలి ఉండటం ముఖ్యం అనే ఉద్దేశ్యంలొ ఈ మాట అంటుంటారు మన పెద్దలు..ఇప్పటికైనా తెలిసిందా మన సామెతల వెనుక ఎంత అర్థం ఉంటుందో.

Related Articles

Back to top button
Send this to a friend