శభాష్ కమల్

 

ప్రమాదం చెప్పిరాదు. కానీ దాని తాలూకూ ప్రభావం మాత్రం అనేక కుటుంబాలపై పడుతుంది. సాధారణంగా ప్రమాదాల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని జాగ్రత్తగా షూటింగ్ లు చేస్తారు మన సినిమా వాళ్లు. ఏ భాషలో అయినా సరే సినిమా వాళ్లు చాలా జాగ్రత్తగానే ఉంటారు. ఎందుకంటే చిన్న ప్రమాదం జరిగినా పెద్ద విషయ అవుతుంది. కొన్నాళ్ల క్రితం కన్నడంలో ఓ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో నీటిలో మునిగిన ఇద్దరు ఫైటర్లు చనిపోయారు. అది పూర్తిగా నిర్లక్ష్యం. కానీ లేటెస్ట్ గా కోలీవుడ్ లో జరిగిన ప్రమాదం మాత్రం ఊహించనిది.
కమల్ హాసన్ భారతీయుడు -2 చిత్రీకరణలో భాగంగా జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈ ముగ్గురినీ ఆదుకుంటానని కమల్ ప్రకటించాడు. చెప్పినట్టుగానే కోటి రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. అటు నిర్మాణ సంస్థ కూడా వీరికి అండగా నిలుస్తాం అంటోంది. అయితే కమల్ సాయం చేయడం ఓ ఎత్తైతే అంత పెద్ద మొత్తం అస్సలెవరూ ఊహించలేదు.
పోయిన ప్రాణాలు ఎలాగూ ఎవరూ వెనక్కి తేలేరు. డబ్బులు మనషిని రీ ప్లేస్ చేయలేకపోవచ్చు. కానీ అతను ఆ కుటుంబంలో నెరవేర్చాలనుకున్న బాధ్యతలకు బాసటగా ఉంటాయి. మొత్తంగా కమల్ హాసన్ ఔదార్యానికి అంతా మెచ్చుకుంటున్నారు. శభాష్ కమల్ అంటున్నారు.

Related Articles

Back to top button
Send this to a friend