మరోసారి క్రేజీ హీరోతో కాజల్ అగర్వాల్
చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ కెరీర్ చివరి దశలోఉంది అనుకున్న ప్రతిసారీ క్రేజీ ప్రాజెక్ట్స్ తో బౌన్స్ బ్యాక్ అవుతోంది. అసలే ఇప్పుడు తెలుగులో హీరోయిన్ల కొరత ఉందని అందరికీ తెలుసు. ఇదే ప్రాబ్లమ్ తమిళ్ లో కూడా ఉంది. అందుకే ఇక్కడి భామలు అక్కడ అక్కి భామలు ఇక్కడ రోమింగ్ అవుతుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ సరసన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న కాజల్ కు మరోసారి సూపర్ స్టార్ సరసన కూడా ఆఫర్ వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇది తెలుగు సినిమా కాదు.. తమిళ్ మూవీ.
తమిళ్ సూపర్ స్టార్ గా తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు ఇళయదళపతి విజయ్. అతని లేటెస్ట్ మూవీ మాస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతర్వాత విజయ్ సుధా కొంగర దర్శకత్వంలోఓ సినిమా చేయబోతున్నాడు. అటుపై మరోసారి మురుగదాస్ తో సినిమా ఉంటుంది. ఈ మూవీలోనే కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు అంటున్నారు. మరోవైపు ఇది గతంలో విజయ్, మురుగదాస్ కాంబోలో వచ్చిన తుపాకి సినిమాకు సీక్వెల అనే మాటలూ వినిపిస్తున్నాయి. ఆ కారణంగా కాజల్ ను తీసుకుంటున్నారా లేక నిజంగానే ఇది మరో కొత్త సినిమానా అన్నది తేలాల్సి ఉంది.
ఇక గతంలో విజయ్, కాజల్ కాంబినేషన్ లో తుపాకి, జిల్లా, మెర్సల్ సినిమాలు వచ్చాయి. వీటిలో జిల్లా సినిమా యావరేజ్ అనిపించుకుంది. మిగతా రెండూ బ్లాక్ బస్టర్స్. ఈ మూడు సినిమాలూ తెలుగులోనూ డబ్ అయ్యాయి. ఏదేమైనా కాజల్ కు మరోసారి విజయ్ సరసన ఆఫర్ అంటే ఖచ్చితంగా ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.