అతిపెద్ద స్కామ్ లో కాజల్ అగర్వాల్

Kajal Agarwal in Mosagallu

కాజల్ అగర్వాల్.. పదేళ్ల పాటు టాలీవుడ్ ఏలింది. కొన్నాళ్లుగా సినిమాల్లేక ఖాళీగా ఉంటోంది. అంటే కొన్ని సినిమాలున్నా.. అవి తన పాత ఇమేజ్ కు తగ్గవి కావు. అందుకే చిన్నా చితకా సినిమాలు కూడా చేస్తోంది. లేటెస్ట్ భారతీయుడు -2 షూటింగ్ లో ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉందీ చందమామ. కాస్తలో తప్పించుకున్న ఈ భామ ఇప్పుడు వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐటి స్కామ్ లో కనిపిస్తోంది. అంటే తను మోసగత్తె అని చెప్పలేం. కానీ మోసగాళ్లతోనే కలిసి రాబోతోంది.
యస్.. మంచు విష్ణు నిర్మిస్తోన్న ఇంటర్నేషనల్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ప్రపంచలో జరిగిన అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా వస్తోన్న ఈ చిత్రానికి తెలుగులో మోసగాళ్లు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందు నుంచి కాజల్ లుక్ ను విడుదల చేశారు. ఇక ఈచిత్రానికి జెఫ్రీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. శివరాత్రి సందర్భంగా విడుదలైందీ పోస్టర్. మొత్తంగా ఈ సినిమాలో కాజల్, మంచు విష్ణు సిస్టర్ పాత్రలో కనిపించబోతోంది అనే వార్త కూడా ఉంది. ఈ యేడాది సమ్మర్ లోనే విడుదల కాబోతోన్న ఈ పోస్టర్ లో కాజల్ స్టైలిష్ గా ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ లా కనిపిస్తోంది. మరి ఈ మూవీతో కాజల్ కంటే ముందు మంచు విష్ణు ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

Related Articles

Back to top button
Send this to a friend