సొమ్ము హారికది సోకు ఎన్టీఆర్ ది!!!

NTR 30 producing by Harika Hasini and NTR Arts


ఇదే మాటను కొన్నాళ్ల క్రితం కూడా చెప్పుకుంటే సొమ్ము హారికది.. సోకు గీతది అనొచ్చు. ఇప్పుడది ఎన్టీఆర్ గా మారింది. ఓ రకంగా టాలీవుడ్ లో ఇదో కొత్త ట్రెండ్ లా మారిందేమో. తరచి చూస్తే ఇది హీరోలతో పాటు వారి తోక నిర్మాణ సంస్థలకు ఉపయోగకరంగానూ.. ప్రధాన నిర్మాణ సంస్థకు భారంగానూ మారుతుంది. మాట కాస్త ఘాటుగా అనిపించినా ఇదే నిజం. ఈ సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురములో సినిమాను నిర్మించింది హారిక హాసిని సంస్థ. అయితే తన బ్యానర్ ను కూడా భాగస్వామిగా చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టడాడు. చేసేదేం లేక గీతను కూడా హారికలో కలిపి ‘సంయుక్త నిర్మాణం’చేశాయి. కానీ వాస్తవం ఏంటంటే.. ఈ నిర్మాణంలో గీతా ఆర్ట్స్ నుంచి ప్రొడక్షన్ కు పైసా పెట్టరు. కానీ బ్యానర్ వాల్యూ యాడ్ అవుతుంది. హీరోకు ‘మేలు’చేసిన ఫీలింగ్ తో చేస్తుంటారు. అలాగే లాభాల్లో మాత్రం వాటాలుంటాయి. అలా తన జేబు నుంచి ఒక్క చెక్కూ పెట్టకుండానే గీతా ఆర్ట్స్ కు అల వైకుంఠపురములో లాభాలిచ్చింది. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇదే చేస్తున్నాడు.
త్వరలో ఇదే బ్యానర్ లో త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా కోసం తన అన్న కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ను రంగంలోకి దించాడు. అదేమంటే తన డేట్స్ అక్కడ ఉన్నాయి అనే డైలాగ్ కూడా వినిపిస్తుంది. అందువల్ల ఆ డేట్స్ కోసమైనా ఈ బ్యానర్ ను తమ పోస్టర్ లో వేసుకుంటుంది హారిక హాసిని బ్యానర్. కట్ చేస్తే మళ్లీ సేమ్ సీన్.. ఈ సారి కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ రూపాయి పెట్టదు. కానీ లాభాల్లో వాటా ఉంటుంది. అలా సొమ్ము హారికది సోకు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ది అవుతుందన్నమాట. ఏదేమైనా మన హీరోలు తెలివి మీరుతున్నారబ్బా.. పాపం అసలు నిర్మాతలకు కొసరు లాభం.. కొసరు వాళ్లకు సిసలు లాభం. ఈ కొత్త యాపారం ఏదో బావుంది కదూ..
అన్నట్టు మహేష్ బాబు కూడా కొన్నాళ్లుగా ఇదే చేస్తున్నాడుగా.. బ్యానర్ ఎవరిదైనా అందులో తన ఎమ్.బి ప్రొడక్షన్స్ లోగో కూడా కంపల్సరీ.

Related Articles

Back to top button
Send this to a friend