మత్స్త్య కారులు నేపథ్యం లో ప్రారంభమైన “జెట్టి”

వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబ్రమణ్యం ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రారంభమైన మూవీ ‘జెట్టి’. మత్స్యకారుల నేపథ్యం లో
తెలుగు తెరపై ఎప్పూడూ చూడని కథాంశం ను తెరమీదకు తెస్తున్న చిత్రం జెట్టి. అజయ్ ఘోష్, మన్యం కృష్ణ, మైమ్ గోపి ప్రధాన పాత్రలలో
నటిస్తున్న ఈ మూవీ ప్రారంభం ప్రకాశం జిల్లా, చీరాల మండలం, వేటపాలం దగ్గరలోని శ్రీకనకనాగవరపమ్మ గుడిలో జరిగింది.
తెలుగు సినిమా నేటివిటీ ఉన్న కథలవైపు ప్రయాణం చేస్తున్న టైం లో ‘జెట్టి ’ తెలుగు తెరకు కొత్త కథగా మారుతుంది.
వైసీపి నేతలు, ఆమంచి కృష్ణమోహాన్ , మోపిదేవి వెంకటరణ, మోపిదేవి హారి బాబు లు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా
అజయ్ ఘోష్ మాట్లాడుతూ ‘ఇప్పటి వరకూ ఆర్టిస్ట్ గా నేను చేసిన పాత్రలలో భిన్నమైన పాత్రను చేస్తున్నాను. మత్య్స కారుల జీవితాలు,
వారి కట్టుబాట్లు అంతంగా బయట ప్రపంచానికి తెలియవు.ఈ సినిమా తో అలాంటి కథలు బయటకు వస్తాయి. దర్శకుడు కొత్త వాడయినా కథ
చెప్పినప్పుడే ఇందులోని లోతు అర్ధం అయ్యింది. తప్పకుండా మా ప్రయత్నం ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను’ అన్నారు.

దర్శకుడు
సుబ్రమణ్యం పిచ్చుక మాట్లాడుతూ‘ ప్రపంచం అంతా సాంకేతికంగా పరుగులు పెడుతున్నా.అనాదిగా వస్తున్న ఆచారాలని నమ్ముకుంటూ, వాటి విలువల్ని పాటిస్తూ, సముద్రపు ఒడ్డున ఆవాసాలు ఏర్పాటు చేసుకుని, సముద్రపు అలలపైన జీవిత పయనం సాగించే మత్స్యకార గ్రామాలు ఎన్నో ఉన్నాయ్, అలాంటి ఒక గ్రామంలో జరిగిన కథ. మత్స్యకారుల జీవన విధానాల్ని, వారి కట్టుబాట్లని, వారు పడే కష్టాలకు పరిష్కారం ఏంటో తెలియచెప్పటమే ప్రధానాంశంగా రూపొందుతున్న సినిమా
“జెట్టి”. తెలుగు తెరపై ఈ నేపథ్యం కథలు ఇప్పటి వరకూ రాలేదు. పూర్తిగా మత్య్సకారుల జీవితాలను ఇందులో ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. దర్శకుడిగా నా తొలి ప్రయత్నం కి అండగా నిలిచిన నా నిర్మాతలు కునపరెడ్డి వేణు మాధవ్, పండ్రాజు వెంకట రామారావు లకు కృతజ్ఞతలు మిగతా నటీ నటుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం ’ అన్నారు.

బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్
మ్యూజిక్ : వందేమాతరం శ్రీనివాస్
డిఓపి: సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు
ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్
స్టంట్స్: దేవరాజ్ నునె, కింగ్ సాలోమాన్
కోరియోగ్రాఫర్ : అనీష్
పబ్లిసిటీ డిజైనర్: అనీల్ అండ్ భాను
పిఆర్ ఓ : జియస్ కె మీడియా
నటీ నటులు: అజయ్ ఘోష్, మన్యం క్రిష్ణ, మైమ్ గోపి తదితరులు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Send this to a friend