జనక అయితే గనక’ విడుదల వాయిదా

    Written By: Last Updated:

Janaka Aithe Ganaka Movie Release Update

Janaka Aithe Ganaka Movie Release Update

దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న సినిమా ‘జనక అయితే గనక’. శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్‌ హీరోగా నటించారు. సందీప్‌ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. సంగీర్తన హీరోయిన్‌గా నటించారు.సెప్టెంబర్‌ 7న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కావాల్సింది. అయితే వర్షాలు, వరదల కారణంగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ”సెప్టెంబర్‌ 7న ‘జనక అయితే గనక’ సినిమాతో మీ అందరి ముందుకొద్దామని అనుకున్నాం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు, వాటి వల్ల ఏర్పడ్డ వరదలు, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ‘జనక అయితే గనక’ విడుదలను వాయిదా వేస్తున్నాం. నవ్వుల వినోదం పండించే రోజును త్వరలోనే ప్రకటిస్తాం. మంచి కాన్సెప్టులతో సినిమాలు ఆడుతుంటే మాకొక కిక్‌ వస్తుంది. అలాంటి కిక్‌ ఇస్తుంది ఈ సినిమా. సందీప్‌ తన రియల్‌ లైఫ్‌లో చూసిన ఇన్సిడెన్స్ బేస్‌ చేసుకుని ఈ కథ సిద్ధం చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశామనే తృప్తి ప్రేక్షకులకు ఉంటుంది. కావాల్సినంత హ్యూమర్‌ ఉంటుంది ఈ సినిమాలో. మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా సుహాస్‌ చక్కగా నటించారు. ఫైనల్‌ వెర్షన్‌ చూశాక సుహాస్‌.. యుఎస్ఏ హక్కులు తీసుకున్నారు. ప్రేక్షకులు అందరూ థియేటర్లలో చూసి ఆస్వాదించాల్సిన సినిమా కాబట్టి, త్వరలోనే మంచి రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తాం” అని అన్నారు.

సుహాస్‌ మాట్లాడుతూ ”ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మా నిర్మాత సినిమా విడుదలను వాయిదా వేశారు. మూవీ ఫైనల్‌ వెర్షన్‌ చూశాను. చాలా బాగా నచ్చింది. ఆ వెంటనే యుఎస్ఏ హక్కులను తీసుకున్నాను. పక్కా ఎంటర్‌టైనింగ్‌ సినిమా అవుతుంది. ప్రతి దానికీ లెక్కలు చెప్పే మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా ఈ సినిమాలో కనిపిస్తాను. తప్పకుండా ప్రేక్షకులు పడీ పడీ నవ్వుకుంటారు. మా డైరక్టర్‌ చాలా మంచి సినిమా చేశారు. దిల్‌రాజు గారు సపోర్ట్ చేసిన తీరు మర్చిపోలేం. ” అని అన్నారు.