ప్యార్ కరోనా…అంటున్న హీరోయిన్లు

కరోనా టైమ్ మనుషుల కే కాదు జంతువులకు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ అవసరం.ముఖ్యం గా పెంపుడు జంతువుల వల్ల వ్యాధి రాదు అనే నిజాన్ని మరింత బలంగా చెప్పేందుకు హీరోయిన్ లు తమ వంతు గా కృషి చేస్తున్నారు.లాక్ డౌన్ లో వాటికి తగినంత సమయం కేటాయించి,ప్రేమ ను పంచండి అంటూ ప్రచారం చేస్తున్నారు.మన హీరోయిన్ లకు అయి తే మూగ జీవాలు అంటే తెగ ప్రేమ, అందరి ఇళ్ళ లో ఏదో ఒక పెంపుడు జంతువు తప్పక ఉంటుంది.పనిలో అలసి ఇంటి వచ్చినప్పుడు వాటిని చూడగానే అలసట పోతుంది అంటారు మన ముద్దు గుమ్మలు.మరి  ఇప్పుడు కావలసినంత ఖాళీ సమయం కదా అందుకే వాటితో బాగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు.మన ప్రణీత ,పాయల్  రాజ్ పుత్,కీర్తి సురేష్, అంజలి ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు.పెట్స్ ను ముద్దాడుతు దిగిన ఫోటో ల తో వారి సోషల్ మీడియా పేజీ లను నింపేస్తున్నారు..శ్రుతి హాసన్ ఐతే తన పిల్లి కార్లా ను వదిలి  అసలు ఉండటం లేదు.దానితో వ్యాయామం కూడా చేయిస్తుందట.కష్టం లో మనుషులు ఐనా మూగ జీవాలు ఐనా కోరుకునెేది ప్రేమే కదా.అందుకే వాటితో సరదాగా కాలక్షేపం చేస్తూ పోస్ట్ చేస్తున్న వీడియో లు బాగా వైరల్ అవుతున్నాయి.

Related Articles

Back to top button
Send this to a friend