నితిన్ అదృష్టవంతుడా..?

Hero Nithin lucky?


టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే ట్యాగ్ కు త్వరలోనే ఫుల్ స్టాప్ పెట్టబోతోన్న నితిన్.. పెళ్లికి ముందు లక్ చెక్ చేసుకుంటూ ఇవాళ భీష్మతో వచ్చాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఊహించినట్టుగానే పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగని మరీ ఇదేమీ బ్లాక్ బస్టర్ కాదు. కాకపోతే నితిన్ వరుస ఫ్లాపులతో ఉన్నాడు కదా.. వాటితో పోలిస్తే చాలా బెటర్. అయితే ఈ బెటర్ టాక్ వెనక ఉన్న ఫ్యాక్ట్ పేరు రష్మిక మందన్నా. యస్.. తను ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిన్నగాక మొన్నొచ్చినా.. ఎన్నో సీన్స్ లో నితిన్ ను డామినేట్ చేసే నటన చూపించింది. అటు నితిన్ కూడా చాలా కాన్ఫిడెంట్ గానే కనిపించాడనుకోండి.
వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆర్గానిక్ ఫామ్ ప్రాధాన్యతను చర్చిస్తూ నడిచే కథ. కథనం ఎంటర్టైనింగ్ గా ఉంటే చాలనుకున్నాడేమో దర్శకుడు మరీ సీరియస్ గా ఈ సబ్జెక్ట్ పై ఫోకస్ పెట్టలేదు. అలాగే ప్రేమకథ కూడా మరీ కొత్తగా లేదు. కాకపోతే ఈ మధ్య వచ్చిన గ్యాప్ ను ఫిల్ చేసేంత స్టఫ్ అయితే కొంత వరకూ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ బెటర్ అనిపిస్తుంది. ఆ కారణంగానే సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఒకవేళ సెకండ్ హాఫ్ కూడా మొదటి భాగంలానే ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ ఫ్రైడే నితిన్ కు షాక్ ఇచ్చేదే.
ఏదేమైనా సినిమాలోని క్లైమాక్స్ లో వినిపించే డైలాగ్ లా.. బలవంతుడిని ఓడించవచ్చు.. కానీ అదృష్టవంతుడిని గెలవలేం.. అన్నట్టుగా ఈ సారి నితిన్ కు అదృష్టం రష్మిక రూపంలో వచ్చింది. అటు కాబోయే భార్య కూడా కలిసొచ్చిందేమో.

Related Articles

Back to top button
Send this to a friend