సరుకులు పంపిణి చేసిన హీరో అభినవ్

మనమందరం మన చుట్టుపక్కల లేదా మన ఊరిలోని వారికి ఎవరికైనా సహాయం చెయ్యాలి అనుకుంటే చేస్తాం. కోవిడ్ 19 సమయంలో, లాక్ డౌన్ ఉన్నప్పుడు మారుమూల పల్లెటూరు తాండకు వెళ్ళి 100 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు హీరో, బిజినెస్ మ్యాన్, హైదరాబాద్ తల్వార్స్ సెలెబ్రిటీ క్రికెట్ టీమ్ ఫౌండర్ మరియు చైర్మన్ అభినవ్ సర్దార్.

ఇప్పటిదాకా హైదరాబాద్ లోని 700 కుటుంబాలకు సహాయం అందించి ఇప్పుడు హైదరాబాద్ నుండి 200 కిమి, ప్రయాణం చేసి ఎర్రబెల్లి తండాలో రెడ్ జోన్ ఉన్నప్పటికీ లేక్కచెయ్యకుండా అక్కడ 100 మందికి 20 రోజులకు సరిపడా సరుకులు పంపిణి చేశారు.

*ఈ సందర్బంగా అభినవ్ సర్దార్ మాట్లాడుతూ….*

నేను ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలకు ముందు ఉంటాను, నేను చదువుకున్న NIT వరంగల్ ఏరియాలో సమస్య ఉందని నా స్నేహితుడు తేజ్ చెప్పగానే అక్కడికి వెళ్లి సహాయం చేయడానికి ముందుకు వచ్చాను. అలాగే సైనిక్ స్కూల్, కోరుకుంచర్ల క్లాస్ మేట్స్ సహకారంతో చాలామందికి నిత్యావసర సరుకులు పంపిణి చెయ్యడం జరిగింది. ప్రేత్యేకంగా సైనిక్ స్కూల్ క్లాస్ మేట్స్ కు అలాగే వరంగల్ రవికుమార్ సార్ కు ఆ గ్రూప్ సర్పంచ్ గారికి సిఐ బాబా గారికి నా ఫ్రెండ్ తేజ్ కు అభినందనలు తెలువుతున్నాను.

Related Articles

Back to top button
Send this to a friend