‘క‌మిట్‌మెంట్’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

    Written By: Last Updated:

కొద్ది రోజుల క్రితం ‘క‌మిట్‌మెంట్‌’ సినిమాలోని న‌లుగురు ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌ను ఇంట్ర‌డ్యూస్ చేస్తూ విడుద‌ల చేసిన స్పెష‌ల్ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. న‌లుగురి క‌థ‌గా రూపొందుతోన్న ఈ ఎరోటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో తేజ‌స్వి మ‌దివాడ‌, ర‌మ్య ప‌సుపులేటి, సిమ‌ర్ సింగ్‌, అన్వేషి జైన్ మెయిన్ రోల్స్ పోషిస్తున్నారు. “ల‌వ్‌.. డ్రీమ్‌.. హోప్‌.. ఫైట్” అనేది ఈ మూవీ ట్యాగ్‌లైన్‌.

శుక్ర‌వారం (జూలై 3) తేజ‌స్వి మ‌దివాడ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా, ‘క‌మిట్‌మెంట్‌’లో ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో బికినీ ధ‌రించి బోల్డ్ అవ‌తార్‌లో తేజ‌స్వి ద‌ర్శ‌న‌మిస్తున్నారు. మునుప‌టి పోస్ట‌ర్ త‌ర‌హాలోనే ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సైతం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది.

‘హైద‌రాబాద్ న‌వాబ్స్’ ఫేమ్ ల‌క్ష్మీకాంత్ చెన్నా ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం అందిస్తోన్న ఈ చిత్రానికి న‌రేష్ కుమ‌ర‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. స‌జీష్ రాజేంద్ర‌న్‌, న‌రేష్ రాణా సినిమాటోగ్రాఫ‌ర్లుగా ప‌నిచేస్తున్నారు.

సాంకేతిక బృందం:
డైలాగ్స్‌: స‌ంతోష్ హ‌ర్ష‌, కార్తీక్‌-అర్జున్‌, క‌ళ్లి క‌ల్యాణ్‌
లిరిక్స్‌: పూర్ణాచారి, గాంధీ
మ్యూజిక్‌: న‌రేష్ కుమ‌ర‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌జీష్ రాజేంద్ర‌న్‌, న‌రేష్ రాణా
ఎడిటింగ్‌: ప‌్ర‌వీణ్ పూడి
కొరియోగ్ర‌ఫీ: హ‌రి కిర‌ణ్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌
లైన్ ప్రొడ్యూస‌ర్‌: సురేష్ పొలాకి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ద‌్వార‌కేష్‌
నిర్మాత‌లు: బ‌ల‌దేవ్ సింగ్‌, నీలిమ టి.
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ల‌క్ష్మీకాంత్ చెన్నా
బ్యాన‌ర్స్‌: ఎఫ్‌3 ప్రొడ‌క్ష‌న్స్‌, ఫుట్‌లూజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్