భర్త నుంచి విడిపోలేదు అంటున్నహీరోయిన్

కలర్స్ ప్రోగ్రాం ద్వారా  బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సినిమాల్లో ఆర్టిస్ట్ గా  గుర్తింపు తెచ్చుకుని త్రిపుర లాంటి సినిమా లో నటన తో అందర్నీ ఆకట్టుకున్న తెలుగింటి అమ్మాయి స్వాతి.తమిళం లో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే వికాస్ తో పెళ్ళి తర్వాత విదేశాలకు మకాం మార్చి సినిమాకు దూరంగా ఉంది.సినిమాలకు దూరం అయినా సోషల్ మీడియా లో తన అభిమానులకు ఎప్పుడూ దగ్గర గానే ఉంటూ వచ్చింది.అయితే ఇపుడు అదే తన కొంప ముంచింది.తాజా గా తన భర్త తో ఉన్న ఫోటోలను నుండి డిలీట్ చేయడం తో వారిద్దరి వివాహ బంధం చెడి పోయిందని ఇప్పుడు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.దీనికి కారణం గతం లో చాలా మంది హీరోయిన్లు కూడా ఇలానే చేశారు బ్రేక్ అప్ అయినప్పుడు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి ఉన్న ఫోటో లను తమ అకౌంట్స్ నుండి డిలీట్ చేశారు.అందుకే ఇప్పుడు స్వాతి చేసిన పనికి కూడా అదే కారణం అయింటుందని అనుకుంటున్నారు..అయితే దీనికి స్వాతి తన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చింది.తన ఫోన్ లోని ఆర్చివ్ ఫోల్డర్ లో ఉన్న వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను  చూపిస్తూ వీడియో ను పోస్ట్ చేసింది.అంతే కాదు చూపిస్తే నే ప్రేమ కాదు ,కొన్నిసార్లు ఏమి లేకపోయినా కూడా దానికి చాలా వీలువ ఉంటుంది అనే అర్థం వచ్చేలా Harry potter సినిమా లోని సంభాషణలను పోస్ట్ చేసింది..నిజమే గా ఎవరి వ్యక్తిగతం వాళ్ళది..

Related Articles

Back to top button
Send this to a friend